మొన్నటి వరకు తాము స్వలింగ సంపర్కులమని ధైర్యంగా చెప్పుకున్న దక్షిణాఫ్రికా మహిళా జట్టు క్రికెటర్లు మరిజాన్ కాప్, వాన్ నికెర్క్ లు పెళ్లి చేసుకున్నారు.  2009వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీతో అంత‌ర్జా‌తీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి‌న ఈ క్రీడాకారిణిలిద్దరు కొద్ది‌రోలుగా ప్రేమించుకుంటున్నారు. కాగా ద‌క్షిణాఫ్రికాలో ఇద్ద‌రు మ‌హిళ‌లు పెళ్ళి చేసుకోవ‌డంపై ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యా‌రు.

ఇక కాప్, ఐసీసీ టాప్-10లో కొనసాగుతోంది. వీరిద్దరూ గతంలో దక్షిణాఫ్రికా బాలుర అకాడమీలో శిక్షణ పొందిన అమ్మాయిలుగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.  కాగా,  2009 వరల్డ్ కప్ టోర్నీ నుంచి జట్టులో ఆడుతున్న నికెర్క్, 2017-18 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్ గా నిలవడంతో పాటు, దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ గానూ నిలిచింది. 

ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. 2017లో న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్ వైట్, లియా తహుహులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: