విపక్షాలపై దుమ్మెత్తి పోయాలంటే వారికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. గొంతులు పెంచుకుని మరీ తిట్ల దండకం మొదలుపెడుతుంటారు. ఏపీలో పార్టీకి సొంతంగా ఒక్క సీటు అంటే ఒక్కసీటు గెలిచే సామర్ధ్యం లేకపోయినా .. నాయకుల బిల్డప్ లు మాత్రం మాములుగా ఉండదు. ఇదంతా ఏపీ బీజేపీ గురించి చెబుతున్నదే. ఏపీ బీజేపీలో నాయకుల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు. ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తూ.. ఒకరితో మరొకరికి సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు. ఆ నాయకుడు ఈ నాయకుడు అన్నతేడా లేకుండా అందరూ ఇదేవిధంగా వ్యవహరిస్తూ పార్టీ పరువును బజారునపడేస్తున్నారు. 

Image result for kanna lakshmi narayana


ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు మరీ ఎక్కువయిపోయాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నఈ తరుణంలో బీజేపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నాయకులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ కార్యక్రమాలు దిశానిర్దేశం లేకుండా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఎలా అన్నది సమస్యగా మారుతోందని సీనియర్ నేతలు అంటున్నారు. అసలే ఏపీలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ దశలో నేతల కుమ్ములాటలు మరింత చేటు తెస్తాయని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. 

Image result for somu viraju

 గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాకపోయినా ఇప్పుడు మరింత ఎక్కువైపోయాయి. అంతకుముందు కాపు సామాజిక వర్గ నేతుల, కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య విభజన కనిపించేది. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కంభంపాటి హరిబాబు వర్గం.. చంద్రబాబును వ్యతిరేకించే సోము వీర్రాజు వర్గం ప్రధానంగా ఉండేవి. కామినేని శ్రీనివాస్ వంటివారు చంద్రబాబుతో ర్యాపో మెంటైన్ చేస్తూ సొంతంగా తన పనులు తాను చక్కబెట్టుకుంటుండేవారు. అయితే... కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడిని చేసిన తరువాత నుంచి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. కన్నా ఎంపికను సోము వీర్రాజు వర్గం బహిరంగంగా వ్యతిరేకించింది. 


 రాజమండ్రిలో సోము వీర్రాజు  పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు తెలియదని ఆయన అనుచరులు చెబుతున్నారు. వీరాజ్రుకు మాజీ మంత్రి మాణిక్యాలరావు అనుకూలంగా ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. మంత్రిగా అన్ని ప్రాంతాలకు సుపరిచితుడైన మాణిక్యాలరావు ఇలా ఉండటం వెనుక పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక హరిబాబయితే పార్టీ అధ్యక్ష పదవి కూడా లేకపోవడంతో ఆయన విశాఖపట్నానికే పరిమితమయ్యారు. 


మొన్నటివరకు టీడీపీ మీద విరుచుకుపడిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ఆ పార్టీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన బాటలోనే నేను అన్నట్టు  మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తాను బీజేపీలోనే ఉంటానని చెబుతూ.. ఇటీవల సీఎం చంద్రబాబుతో కలిసి గుంటూరులో ఒక కార్యక్రమంలో పాల్గొనడం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా కావూరి సాంబశివరావు జాడే కనిపించడం లేదు.  కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ప్రకటనలు మీద ప్రకటనలు గుప్పిస్తున్నా పార్టీ కార్యాలయానికి మాత్రంరావడం లేదు. ఇలా నేతలంతా ఒకరికి ఒకరు సంభంధం లేదన్నట్టుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తుండడంతో త్వరలోనే ఈ అంశాలపై దృష్టి పెట్టాలని అధిష్టానం చూస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: