ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలకు వచ్చే ఎన్నికలకు సంసిద్దమవుతున్న విషయం తెలిసిందే.  ఇక జమిలీ ఎన్నికలకు మాత్రం టీడీపీ కాస్త వెనుకాడుతుంది.  తాజాగా  జమిలి ఎన్నికలకు తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఏపికి ఇప్పుడు పార్లమెంట్ తో పాటే ఎన్నికలు జరుగుతున్నాయని కొత్తగా ఏర్పడే ఎన్నికలు ఏమీ కావని వైసీపీ ఎంపీలు అభిప్రాయ పడ్డారు.  జమిలి ఎన్నికల కారణంగా ఏపిపై ప్రభావం ఉండదని అన్నారు వైసీపీ ఎంపీలు. 


లా కమీషన్ ని కలిసిన విజయ్ సాయి రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు.   జగన్ మోహన్ రెడ్డి అధికారంలో కి వస్తే..టీడీపీలో జరిగిన అక్రమాలన్నింటిపై విచారణ జరిపిస్తామని అన్నారు.  ముఖ్యంగా తిరుమలలో కొనసాగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామనివిజయసాయిరెడ్డి అన్నారు.  చంద్రబాబు ఒట్టి అవినీతి పరుడు..దేశాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి అని భవిష్యత్ లో ఆయన తప్పకుండా జైలుకు పోతాడన్నదానిలో సందేహమే లేదని అన్నారు. 
Image result for ys jagan
ఎన్నికల కమీషన్ కి మా అభిప్రాయాలు చెప్పాం..ఏకాభిప్రాయానికి ప్రయత్నించాలని కూడా చెప్పామని దానిలో ఉన్న ప్రయోజనాలు, అప్రయోజనాలు అన్నీ వివరించి చెప్పామని అన్నారు.  లా కమీషన్, ఎలక్షన్ కమీషన్ లాంటి రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో దానిపైన వర్క్ ఔట్ చేసి దేశానికి మంచిది కాబట్టి.. అభివృద్దికి దోహద పడుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు సహకరిస్తే మంచిదని అభిప్రాయాన్ని మేం వ్యక్తం చేశామని అన్నారు విజయసాయిరెడ్డి.  జమిలీ ఎన్నికలపైన మా పార్టీ అధ్యక్షులు అభిప్రాయం మేరకు సబ్ మిట్ చేయడం జరిగిందని.

గతంలో 1951 నుంచి 1967 వరకు తర్వాత 1999 నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంతో సమానంగా పార్లమెంట్ కి, ఆంధ్ర రాష్ట్రానికి మద్యలో ఓ పీరియడ్ లో తప్పా జమిలీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన వరకు జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో పెద్దగా తేడా లేదు కాబట్టి ఈ విషయాలపై మేం అన్ని స్పష్టంగా చెప్పాం అని జమిలీ ఎన్నికలు జరిగితే..ఖర్చు తగ్గుతుంది..కరప్షన్ తగ్గుతుంది..ఓటుకు నోటు లాంటి కేసులు రావు..ప్రతి సంవత్సరానికో..రెండు సంవత్సరాలకు ఏదో ఒక ఎలక్షన్ వస్తే రాష్ట్రంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని లా కమీషన్ కి వివరించినట్లు విజయ్ సాయిరెడ్డి అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: