పెట్టుబడుల కోసం వివిధ రాష్ట్రాల మధ్య  పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంక్‌పై క్రేజ్‌ పెరిగింది. ప్రతి రాష్ట్రం ఈ ర్యాంక్‌ గొప్ప ఘనత చెప్పుకోనారంభించాయి. దీంతో ప్రతి ఏటా ఈ జాబితా కోసం ఎదురు చూడటం ప్రారంభించాయి. ఈ ఏడాది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంక్‌ను రేపు ప్రకటించనున్నారు. 2016లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నంబర్‌ వన్‌  స్థానాన్ని ఏపీ, తెలంగాణ సంయుక్తంగా గెల్చుకున్నాయి. 2017 ఏడాది జాబితాను రేపు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. 
Image result for andhrapradesh
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వాణిజ్య) ర్యాంకులు తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. వాణిజ్య సంస్కకరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను ప్రపంచ బ్యాంక్, డీఐపీపీ కార్యర్శి రమేష్ అభిషేక్ మంగళవారం ప్రకటించారు.
Image result for telangana
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఈరోజు ఢిల్లీలో డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ఈ ర్యాంకులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల తరువాతి స్థానాల్లో వరుసగా హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌,  మధ్య ప్రదేశ్‌, కర్ణాటక ఉన్నాయి. గత ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒకే రకంగా స్కోరు సాధించి ఇరు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: