రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్న క్యాంటిన్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో ఈ క్యాంటిన్లు నిర్మిస్తున్నారు. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రకాశం పార్కు, ఘోషాసుపత్రి ఆవరణలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పేదవాళ్లు పొట్ట నింపుకోవాలన్నా కనీసం రూ.70 హొటల్‌కు చెల్లించాల్సి వస్తుంది. అదే అన్న క్యాంటిన్ అందుబాటులోకి వస్తే రూ.5 కు అల్పాహారం. 

ప్రతి క్యాంటిన్ ద్వారా రోజుకు 300 మందికి పౌష్టికాహారం.  ఈ రోజు 25 మున్సిపాలిటీల్లో 60 అన్న క్యాంటిన్ లు ప్రారంభం. అక్షయ పాత్ర సంస్థకు క్యాటరింగ్ బాధ్యతలు.  ప్రతి క్యాంటిన్ ద్వారా 250 నుంచి 300 మందికి ఫుడ్ సప్లై. అవసరాన్ని బట్టి ఎక్కువ మందికి ఆహారం అందేలా చర్యలు. రూ.73 విలువైన ఆహారాన్ని సబ్సిడీపై రూ.15 కే అప్పగించనున్న ప్రభుత్వం.

Image result for అన్నా క్యాంటిన్

మొత్తం 203 క్యాంటీన్లను ఏక రూపంలో కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఫుడ్ కోర్ట్సు మదిరిగా అదే స్థాయిలో అంతర్గత డిజైన్లు, ఇంటర్నెట్‌తో కంప్యూటర్ సదుపాయం, ఎలక్ట్రానిక్ టోకెన్ విధానం, సీసీ కెమెరాలు లబ్ధిదారుల ముఖాలు గుర్తించే పరిజ్ఞానం, టీవీలు వీటి ప్రత్యేకత. ఈ క్యాంటీన్‌లో 50 కి.మీ పరిధిలో సరఫరా చేసేలా ఆధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది. ఇక మెనూ విషయానికొస్తే ఉదయం అల్పాహారం మూడు ఇడ్లీ లేదా పూరి, 25 గ్రాము ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం, రాత్రి 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబారు, 75 గ్రాముల పెరుగు పచ్చడి ఉంటుంది.

anna 11072018 3

రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం. ప్రతి ఆదివారం శెలవు దినం. ఇతర ఆరురోజుల్లో ఏదో ఒక రోజు స్పెషల్ రైస్. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్‌ల ద్వారా అల్పాహారం, భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ స్వీకరించింది. ప్రతి రోజూ మూడుపుటలా కల్సి కనీసం 2 లక్షల, 15వేల మంది ఉంటారని ఓ ప్రాథమిక అంచనా. ఇందుకు కోసం ప్రభుత్వం రోజుకు రూ. 75 చెల్లిస్తుంది.

anna 11072018 2

ఇందులో లబ్ధిదారు రూ. 15 చెల్లిస్తుండగా మిగిలిన రూ. 58లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తున్నది. ఇదిలా ఉండగా అల్పాహారం కింద రూ.5 అన్నం, కూరలు కలిపి మొత్తం 800 గ్రాముల భోజనం పెడతారు. అది తిన్న తరువాత చాలకపోతే మరో టోకెన్ ఇస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు టోకెన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నా క్యాంటిన్లు అమల్లోకి వస్తే రోజు కూలీలకు, పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: