Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 4:39 am IST

Menu &Sections

Search

చంద్రబాబుతో ఉండవల్లి భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం

చంద్రబాబుతో ఉండవల్లి భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం
చంద్రబాబుతో ఉండవల్లి భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయ మేధావి ఒకనాటి వైఎస్ రాజశెఖరరెడ్ది అనుంగు సహచరుడు ఉండవల్లి అరుణకుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఉత్తర దక్షిణ దృవాలే.  కాని ఇది రాజకీయం ఎవరి ప్రయోజనాలు వారివి. అయితే ఉండవల్లి కి సంభందిన వరకు తను నమ్మిన సిద్ధాంతం తో ముందుకెళ్ళే మనిషి. అందు లో సందేహంలేదు. కాని చంద్రబాబు వ్యవహారం మాత్రం అనుమానాస్పదం. ఏదో ప్రయోజనం ఆయన్నుండి ఆశించక పోతే సిఎంఓ ఆయన్ను ఆహ్వానించదనేది జగ మెరిగిన సత్యం.
ap-news-tdp-adyakshudu-chandra-babu-nayudu-cm-chan   
ఆంధ్ర ప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యేందుకు రాజమండ్రి మాజీ కాంగ్రేస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్  సోమవారంనాడు సాయంత్రం సచివాల యానికి వచ్చారు.  సీఎంఓ ఆహ్వానం మేరకు ఉండవల్లి అరుణకుమార్  సచివాలయానికి వచ్చినట్టు బయటకు వచ్చిన వార్తలకు ఖచ్చితంగా రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల్లో ఈ వార్త రాజకీయంగా ఒక ఆశక్తి సంతరించుకొంది.


రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహమీల అమలు విషయమై  ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యవహరించే విధానంపై ఉండవల్లి అరుణకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఎన్.డి.యే నుండి బయటపడ్డ ఏపి అధికార టిడిపి ప్రభుత్వం కేంద్రంతో తన తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఇలా యూ-టర్న్ తీసుకోకుంటే చంద్రబాబుకి రాష్ట్రంలో దిక్కూ దివాణం లేకుండా పోతుంది. 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలుపు కోవాలని అవసరార్ధం టీడీపీ భావిస్తోంది.
ap-news-tdp-adyakshudu-chandra-babu-nayudu-cm-chan

విభజనహమీల అమలు విషయమై కేంద్రప్రభుత్వం తీరుపై తాను సుప్రీంలో వేసిన పిటిషన్ పై రాష్ట్రప్రభుత్వం ఇంప్టీడ్ కావాలని గతంలో అరుణ కుమార్ పలుమార్లు డిమాండ్ చేశారు. అయితే  కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్న ఈ తరుణంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యహరించిన ఉండవల్లి అరుణకుమార్  చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యేందుకు రావడం ఒక రకంగా రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది.సీఎంఓ ఆహ్వానం మేరకు తాను రాష్ట్ర సచివాలయానికి వచ్చినట్టు ఉండవల్లి అరుణకుమార్  మీడియా మిత్రులకు వివరించారు. చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి అరుణకుమార్ సమావేశం కావడం ఇదే తొలిసారి కావటం రాజకీయంగా భిన్న ధృవాలైన వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకొంది.


విభజనచట్టం ద్వారా ఇచ్చిన హమీలను అమలు చేయని  కేంద్రప్రభుత్వంపై  న్యాయపోరాటం తదితర అంశాలపై ఉండవల్లి అరుణకుమార్ తో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇంకా కావాలంటే నాలుగు మెట్లు దిగివచ్చైనా ఉండవల్లితో రాజకీయ భాందవ్యం నేరపటానికైనా చంద్రబాబు వెనకాడక పోవచ్చు. గుంటూరు పర్యటనలో నున్న చంద్రబాబు అమరావతికి రాగానే ఉండవల్లి అరుణకుమార్ తో సమావేశం అయ్యారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.
ap-news-tdp-adyakshudu-chandra-babu-nayudu-cm-chan

సిఎం తో భేటీ అనంతరం ఉండవల్లి మీడియాకు ఇచ్చిన సమాచారం 

భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి "నేను ఏ పార్టీలో లేను ఏ పార్టీలో చేరను" అని తేల్చి చెప్పారు. "లోక్‌సభలో విభజనబిల్లు  ముసాయిదా చట్ట విరుద్ధం. నేను గతంలో రాసిన లేఖపై చర్చించేందుకే చంద్రబాబు నన్ను పిలి పించారు. పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలో సలహా ఇచ్చాను.విభజనను అన్యాయంగా తలుపులువేసి చేశారని ఫిబ్రవరి 07న పార్లమెంట్‌లో ప్రధాని నరెంద్ర మోదీ అన్నారు. దానిపై న్యాయం ఎలా చేయాలో సమాధానం చెప్పమని అదే అంశాన్ని పార్లమెంట్‌ లో చర్చకు నోటీసులు ఇమ్మని చెప్పాను. నేను విభజనతీరుపై గతంలో రాసిన పుస్తకాన్ని చంద్రబాబుకు ఇచ్చాను. అన్నింటికీ సంబంధించిన కాగితాలను సీఎంఓ అధి కారులకు ఇచ్చాను. ముందు విభజనచట్టం చట్టవిరుద్ధం అని ప్రశ్నలు స్వల్పకాలిక చర్చకు నోటీసులు ఇవ్వాలని కోరాను. నేను చెప్పాల్సిందం తా నిశితంగా సీఎంకు వివరించాను.. ఇక టీడీపీ నే నిర్ణయం తీసుకోవాలి" అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.


"ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం బాబు గారి మాయామర్మం మరేదైనా ఉందా? లేక ఉండవల్లి చెప్పింది కరక్టేనా? అనేది చంద్ర బాబు నైజం తెలిసిన జనం మదిలో మెదిలే అనుమానం. సమాధానం ఇవ్వాల్సిన ఉండవల్లి అరుణ కుమార్ ఏదో చెప్పి తప్పించుకున్నారా?" అని అమరావతి జనాభిప్రాయం. 
ap-news-tdp-adyakshudu-chandra-babu-nayudu-cm-chan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
About the author