ఆసేతు శీతాచలం జన భారతాన్ని వెండితెరపై తమ నటనాచాతుర్యంతో మరిపించి మురిపించిన నటులు రాజకీయాల్లోకి ప్రవేసిస్తూ ఉండటంతో, ప్రస్తుతమున్న రాజకీయ నాయకులు తాము ప్రజా వేదికలపై తమ నవరస నటనా చాతుర్యాన్ని మహాద్భుతంగా ప్రదర్శించటం జరుగుతూనే ఉంది. అసలు నాలుగు పదుల సంఖ్యలో శాసనసభ స్థానాల్లో కూడా గెలవలేని దేవెగౌడ-కుమారస్వామిల జేడిఎస్ కు ఎక్కడో సుడి ఉండి 'అదృష్టం కూడా ఏలిన్నాటి శనిలా తగుల్కొని, తంతే గార్లె బుట్టలో పడ్డట్టు' ముఖ్యమంత్రి పీఠంపై అడ్దంగా కూర్చోబెట్టింది.


కాంగ్రెస్‌ తో సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేసి కూడా తాను సంతోషంగా లేనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. తనకు తాను గరళకంఠుడిలా అభివర్ణించు కుంటూ శనివారం ఒక సన్మాన సభలో వేదిక పైనే ఆయన కంట తడి కుడా పెట్టుకున్నారు. అయితే ఇదే అదనుగా, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ,  ఆయన  ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ సెటైర్లు వేయటం​ మొదలు పెట్టింది.  అద్భుతంగా నటిస్తూ ప్రజలను వెధవల్ని చేస్తూ మహా నటులను సైతం మించిపోతున్నారు రాజకీయ నాయకులు అనటానికి కుమారస్వామి విలాప లీలా అమృతమే సాక్ష్యం. 

mallikarjuna kharge on kumaraswami weeping కోసం చిత్ర ఫలితం

మన దేశం ఎంతో మంది ప్రతిభ ఉన్న కళాకారులను నటీనటులను జాతికి అందిస్తూ వస్తుంది. నటులు కూడా వారి నటనతో ప్రేక్షక జన సందోహాన్ని మైమరిచిపోయేలా చేస్తూ, నటనతో అలరిస్తూ ఆకట్టుకుంటున్నారు. అదంతా వెండితెరపైనే. ఇదిగో అక్కడ మరో దిగ్గజ నటుడు కుమారస్వామి కూడా ఉన్నారు. తన నటనా కౌశలంతో ఏకధాటిగా ప్రజలను మూడులను పిచ్చోళ్ళను చేసేలా రాజకీయ వీది బాగోతంలో తన నటన మొదలెట్టేశారు.  "----అండ్‌ ది బెస్ట్‌ యాక్టింగ్‌ అవార్డు గోస్‌ టూ..." అంటూ వ్యంగ్యంగా ఒక పోస్టును బీజేపీ ట్విటర్‌ లో పోస్టు చేసింది. పైగా దానికి కుమారస్వామి కంట తడి పెట్టిన వీడియోను జత చేసింది.

 

ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పై కుమారస్వామి సంతృప్తి గానే ఉన్నారని జేడీఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దానిష్‌ అలీ పేర్కొన్నారు. సీఎం కుమారస్వామి కేవలం భావోద్వేగం తోనే అలా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ దానిష్‌ అలీ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. జేడీఎస్ కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ,  సీఎం పదవి అనే అమృతమే తాము ఆయనకు ఇచ్చామనీ, విషం ఇవ్వలేదని కాంగ్రెస్ చెబుతోంది. సమస్యల పరిష్కారంపై దృష్టిసారి స్తే మంచి దని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే, సీఎం కుమారస్వామికి సూచిస్తున్నారు. అంటే నాటకాలాపి ముఖ్యమంత్రి గిరీ వెలగబెట్టమని అన్నట్లే.

mallikarjuna kharge on kumaraswami weeping కోసం చిత్ర ఫలితం

అయితే ముఖ్యమంత్రిగా తాను సంతోషంగా లేనని, విషాన్ని మింగుతున్నట్టుగా వేదనని తనలోనే భరిస్తున్నానని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తు న్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కంటతడిపెట్టడంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యంగ్యోక్తులు సంధించారు.

 

"ఏ ఎజెండా లేని అవకాశవాద రాజకీయ పొత్తు వారిది. నరేంద్ర మోదీని తప్పించాలనే ఏకైక లక్ష్యంపై కలసిన స్నేహం వారిది. తాను మద్దతు ఇస్తున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏడిపించడం, కూలగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా ఆ పార్టీ తన చర్యలతో ముప్పుతిప్పలు పెడుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమ ర్శించారు  గతంలో కాంగ్రెస్ సహకారంతో అదికారం చేపట్టిన చౌదరి చరణ్ సింగ్, చంద్ర శేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ విషయం లో ఏం చేశారో అదే రాజకీయాన్ని మరోసారి కాంగ్రెస్ పునరావృతం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు చూస్తే సినిమాల్లో "బాలీవుడ్ ట్రాజెడీ సినిమాల శకం" గుర్తుకొచ్చింది. రెండు పార్టీల కూటమి ఫలితం ఇదే అయితే, సిద్ధాంత సారూప్యాలు లేకుండా నిరాశ నిస్పృహలతో కూడిన ఇలాంటి పార్టీలు గ్రూపుగా ఏర్పడితే దేశానికి వీళ్లు ఏమి యివ్వగలరు" అని అరుణ్ జైట్లీ నిలదీశారు.


కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కన్నీరు పెట్టుకోవడం కాంగ్రెస్‌తో పొత్తు వల్ల అతను పడుతున్న బాధను స్పష్టంగా తెలియజేస్తోందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా సంతోషంగా లేనని, గొంతులో గరళం ఉంచుకున్న శివునిలా తన పరిస్థితి ఉందని ఇటీవల కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

arun jaitley on kumaraswamy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: