మధ్యయుగాల కాలంలో అనేక మంది సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారి లో ఫ్రాన్స్ కు చెందిన నోస్ట్రడామాస్ కు సమకాలీనులే మన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆ యుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమల ను ప్రదర్శించి  ప్రజాబాహుళ్యం నుంచి పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన "కాలజ్ఞానం" బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో నేటికి ఎన్నో విషయాలు ఋజువయ్యాయి.
TTD Kalagnanam కోసం చిత్ర ఫలితం
దేశానికి స్వాతంత్రం రావటం, మహాత్మా గాంధీ గారు ఆయన జాతికి చేసిన సేవలు, ఇందిరా గాంధీ 14యేళ్ళ పాలన మొదలైనబన్నీ ఆయన చెప్పింది చెప్పినట్లు పొల్లు పోకుండా జరిగిన దాఖలాలు చరిత్రలో పుష్కలం. అదే కాలజ్ఞానంలో ఒక చోట తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా చెప్పారు.. "వెంకన్న గుడి నాలుగు నాళ్ళు పూజల్లేక మూతబడెను" ఆరుగురు దుండగులు దేవాలయాన్ని దోచేసినట్లు కూడా తెలిపారు. ఆయన కాలఙ్జానంలో పలికారు. 
TTD Kalagnanam కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు అదే అలవరసలలో వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఆమాట కూడా నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. 12ఏళ్లకొసారి శ్రీవారి ఆలయంలో జరిగే మహా సంప్రోక్షణ  కార్యక్రమాన్ని వచ్చే నెలలో జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9నుంచి ఆగస్టు 17వరకు 9రోజుల పాటు దర్శనాన్ని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, భక్తులను పరిమితంగా అయినా దర్శనానికి అనుమతించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న మరోసారి బోర్డు అత్యవసర సమావేశం కానుంది.
kalagnanam కోసం చిత్ర ఫలితం
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ పరిపాలనాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మరి తిరుమల ఆలయం గురించి బ్రహ్మాం గారి కాలజ్ఞానం నిజమవుతుందా? లేక దీనికి మరికొంత సమయం పడుతుందా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అంతే కాదు ఆ ఆరుగురు దోపిడీ గాళ్ళెవరో ఇక తెలవాల్సి ఉంది. 
nostradamus కోసం చిత్ర ఫలితం
తిరుమల మహాసంప్రోక్షణ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహాసంప్రోక్షణ విషయంలో గతంలో పాటించిన నిబంధనలే అమలు చేయా లని ముఖ్యమంత్రి  చంద్రబాబు టీటీడీని కి ఆదేశించారు. మహాసంప్రోక్షణ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించాలని చంద్రబాబు సూచించారు.
chandrababu ramana dikshitulu కోసం చిత్ర ఫలితం
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరురోజులపాటు భక్తులదర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జరుగుతున్న వివాదంపై స్పందించిన బాబు భక్తులకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలుఉండొద్దని టీటీడీకి సూచించారు. .రోజులతరబడి భక్తులు ఎదురుచూసేలా చేయొద్దన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారమే పూజాకైంకర్యాలు జరగాలన్నారు.

సంబంధిత చిత్రం

ఆలయం మూసివేత: టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు


తిరుమల ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయం మూసివేత, నడక దారులు మూసివేయడం, చివరికి ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం వంటివి ఆశ్చర్యంగా ఉందని టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు అన్నారు. తాను గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని ఆయనఅన్నారు.గతంలో ఎన్నడూ ఇలా ఆలయాన్ని మూసివేయ లేద ని, అలాగే సిసి టీవీలు ఆపడం వంటివి జరగలేదని ఆయన అన్నారు.


పోటు తవ్వకం, ఆభరణాలు గల్లంతు అయ్యాయన్న ఆరోఫణలకు ఈ చర్యలు ఋజువుగా మారుతున్నాయని అన్నారు తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారన్న అబిప్రాయం కలుగుతుందని దీక్షితులు అన్నారు. తాను చేసిన ఆరోపణలకు సమాదానం ఇవ్వకుండా మంత్రులు, రాజకీయ నేతలతో విమర్శలు చేయించి అవమానం చేశారని ఆయన అన్నారు.ఇదెలా ఉన్నా,స్వామివారిని భక్తులకు మరింత దూరం చేయడం బాదాకరమని ఆయన అన్నారు.

chandrababu ramana dikshitulu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: