రాజ‌కీయాల్లో నేత‌ల భ‌విష్య‌త్తును ప్ర‌జ‌లే తేలుస్తార‌ని అంటారు. ఈ విష‌యంలో ఎలాంట తేడా లేకుండా గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌లే పాల‌కుల‌, రాజ‌కీయ నేత‌ల జీవితాల‌ను వారి భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తున్నారు. సామాజిక మార్పు-ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు మెగా స్టార్ చిరంజీవి. వ‌చ్చిన కొత్త‌ల్లో తాను పూర్తిగా రాజ‌కీయాల‌కే అంకిత‌మ‌ని, త‌న దేహం ప్ర‌జ‌ల‌కోస‌మేన‌ని భారీ ఎత్తున డైలాగులు పేల్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న జీవితం ఏంట‌నేది ప్ర‌జలే తేల్చిపారేశారు. ఇక‌, ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ రంగంలోకి దిగారు. దేశం, సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తా. పాతికేళ్లు ప్రజాసేవలో ఉండేందుకు సిద్ధమైయ్యే వచ్చాను. 

Image result for chiranjeevi

సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన అవసరం ఉంది. జనసేన అలాంటి రాజకీయాలనే చేస్తోంది అని పవన్ వ‌క్కాణిస్తున్నారు. అయితే, ఎవ‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్తునైనా తేల్చేది ప్ర‌జ‌లే కాబ‌ట్టి.. తాను పాతికేళ్లు ఉండాల‌ని అనుకున్నా.. ప్ర‌జ‌ల ఆమోదం, హ‌ర్షం లేక‌పోతే.. అది పాతిక నెల‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌నేది విమ‌ర్శ‌కుల‌ మాట‌. దాదాపు 2 కోట్ల మందిని జనసేనలో భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ప‌వ‌న్ ప‌నిచేస్తు్న్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ల‌క్ష్యం దిశ‌గా ప‌డిన అడుగులు మాత్రం చాలా చాలా స్వ‌ల్ప‌మే! దాదాపు నాలుగేళ్ల స‌మ‌యం వృధా అయింద‌నే వ్యాఖ్య‌లు జ‌న‌సేన‌లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 


నాలుగేళ్లుగా పార్టీని ఉరుకులు ప‌రుగులు పెట్టించి, పార్టీ స‌భ్య‌త్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఇప్ప‌టికే పార్టీ స‌గానికిపైగా ప్రాంతాల్లో పుంజుకునేద‌ని అంటున్నారు. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌ల‌ను పెట్టుకుని ఇప్ప‌టికీ.. ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా ప‌వ‌న్ సాగుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో పాతికేళ్లు మాత్ర‌మే ఉండాల‌ని ఉంద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితిని బ‌ట్టి ఈయ‌న పార్టీలో ఉండ‌డ‌మా? ప‌్ర‌జ‌ల్లో ఉండ‌మా?  షూటింగుల‌కు వెళ్లి ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం కావ‌డ‌మా? అన్న‌ది తేలిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ చెబుతున్న మాట‌లు, ఆయ‌న వేసుకుంటున్న అంచ‌నాల‌ను ప‌రిశీలిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌నుంది. 


అంటే.. మొత్తంగా జ‌న‌సేనాని క‌నీసం 50కి పైగా అయినా సీట్ల‌లో గెలిస్తే.. అధికారం మాట అటుంచి ప‌రువైనా ద‌క్కేది. గ‌తంలో చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు కేవ‌లం 18 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఆ ప‌రిస్థితిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌గ‌డం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అందుకే ఆయ‌న పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేశారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు ఇలాంటి ప‌రిస్థితే ఎదురైతే.. పాతికేళ్లు కాదుక‌దా.. పాతిక నెల‌లు కూడా ఆయ‌న రాజ‌కీయాలు చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. సో.. ఇదీ ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్ర‌స్థానం. 



మరింత సమాచారం తెలుసుకోండి: