ttd images కోసం చిత్ర ఫలితం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు-టిటిడి-లో ఆధ్యాత్మికవేత్తలకు స్థానం లేకుండా పోయిందని టిటిడి మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయనేతలకు తప్ప ప్రస్తుతం బోర్డులో రాజకీయనేతలు, హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనివారే కొన సాగుతున్నారని ఆయన చెప్పారు. అదికారులు సైతం అహంకారంతో వ్యవహరిస్తున్నారని దానివల్లనే ఆలయ మూసివేత వంటి నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. టిటిడిలో ఆద్యాత్మిక వేత్తలు, ఆగమ శాస్త్రంలో నిష్ణాతులను నియమించాలని ఆయన సూచించారు.

maha samprokshaNam in TTD కోసం చిత్ర ఫలితంఆలయ మూసివేత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు దీనిపై ఆదేశాలు ఇచ్చారు?

అయినా పాలక మండలి సమావేశం జరపాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?

పాలక మండలి, బోర్డు నిర్ణయాల వెనుక ఎవరు ఉన్నారు?

మహా సంప్రోక్షణపై టిటిడి చైర్మన్ కు అవగాహన లేదా?

social media attack on TTD decision to close temple కోసం చిత్ర ఫలితం

అన్న విషయం అర్దం అయిపోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏమీ లేదని, కొందరి ప్రోద్బలంతోనే తనపట్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు తెలిపారు. తాను గతంలో చేసిన ఆరోపణలపై భక్తుల నుంచి స్పందన కరువైందని, కొండమీదున్న సాటి అర్చకుల మద్దతు కూడా లభించ లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.

 


మంగళవారం ఆయన చెన్నైలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మహా సంప్రోక్షణ సందర్భంగా దర్శనాలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. గతంలో తాను చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అన్నారు.  వీలైనంత వరకు, పరిమిత సంఖ్యలోనైనా దర్శనాలకు అనుమతించాలని సీఎం అప్పటికే ఆదేశించారని విలేకరులు రమణ దీక్షితులు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించగ్గా, సీబీఐ విచారణ జరపాలని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

ramana deekshitulu కోసం చిత్ర ఫలితం 

‘‘బోర్డులో ఉన్న వారంతా రాజకీయ నేతలే. ఎలాంటి దైవచింతన, సంస్కారం, దేవాలయాలపై నమ్మకం, హిందూ సంప్రదాయాలపై విశ్వాసం లేనివారే. అధికారులు కూడా అహంకారం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నవారే కానీ సేవాభావంతో వచ్చిన వారు కాదు’’ అని అన్నారు.

pitta sudhakar yadav and other members of TTD కోసం చిత్ర ఫలితం

సీఎంను కలిసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నించానని.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి కూడా వెనక్కి తిప్పిపంపారని ఆరోపించారు.  ‘ఇప్పుడిచ్చినా కలుస్తా. సీఎం చంద్రబాబు నాకు చిన్నప్ప టి నుంచి తెలుసు. ఎస్వీ యూనివర్సిటీలో నాకు జూనియర్‌. నాకు బాగా పరిచయమైన వ్యక్తి. కొంత మంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు. మేమంతా స్వామివారి భక్తులమే. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకోవాలి’ అని తెలిపారు.

 


తిరుమల చరిత్రలోనే ఎన్నడూ తీసుకోనంత పెద్ద నిర్ణయం ఆగమేఘాల మీద ఎలా తీసు కున్నారు?

విమర్శలను ఊహించలేదా?

పరిమిత సంఖ్యలో అయినా దర్శనం చేయించలేని నిస్సహాయ స్థితిలో టీటీడీ ఉందా?

ఇంత యంత్రాంగమూ, సాంకేతిక సదుపాయమూ ఉండి కూడా పాతిక వేల మందికి రోజుకు దర్శనం సాధ్యం అని తెలిసీ ఆరు రోజుల పాటు కట్టడి ఎందుకు చేసినట్టు?

 roja mla కోసం చిత్ర ఫలితం

కందిరీగ తుట్టెలా ఇటువంటి ప్రశ్నలు, అనుమానాలు అంతర్జాలంలో విస్పొటనంలా చెలరేగుతూనే ఉండడంతో, ఎడతెగని ఆ వాదనల ఉదృతి చెలియలికట్ట దాటక ముందే హిందూసమాజం ఉవ్వెత్తున చెలరేగే వాతావరణం గమనించే టీటీడీ యూటర్న్‌ తీసుకుంది. సందేహాలకే పరిమితం కాకుండా ఇవి రాజకీయ రంగు కూడా పులుముకుంటూ ఉండడంతో ముఖ్య మంత్రికి ముచ్చెమటలు పట్టాయని అందుకే ఆయన ఆఘమేఘాలపై జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  మహా సంప్రోక్షణ రోజుల్లో దర్శనాలను తిరిగి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించాల్సి వచ్చింది.



ఆరురోజుల పాటు దర్శనం రద్దు అనగానే సోషల్‌ మీడియాలో విమర్శలతో పాటూ, సెటైర్‌లూ, రకరకాల ప్రచారాలూ మొదలయ్యాయి. రెండు వేల ఏళ్ల తిరుమల చరిత్రలో జరగని పని ఇప్పుడు ఎందుకు అనీ, ‘గుప్త నిధులు తవ్వటం కోసమేనా’ అనీ - సీసీ కెమెరాలను తొల గిస్తున్నారనీ’ ఇలా అనుమానాల పుట్ట పగిలింది. ఇంత దుర్మార్గం హిందూసమాజం హిందూమతంపై అంతగా విశ్వాసంలేని  పరమతసానుభూతిపరుడే నాయకుడుగా ఉండటం వలననే సంభవించిందని అంటున్నారు. 

maha samprokshaNam in TTD కోసం చిత్ర ఫలితం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా ఏకంగా తిరుమల ఆలయం ముందే మాటల దాడి చేశారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మళ్ళీ చెన్నైని వేదిక చేసుకుని టీటీడీ నిర్ణయాల పై విరుచుకుపడ్డారు. స్వాములు కూడా కొందరు నిర్ణయాన్నితప్పుపడుతూ మాట్లాడడం ప్రారంభించారు. సామాజిక సమాచార వ్యవస్థ సంఘటితంగా నిఘా పెట్టినట్లు కుమ్మేయటానికి సిద్దమైనది.

maha samprokshaNam in TTD కోసం చిత్ర ఫలితం

మహా సంప్రోక్షణ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం హిందువుల మనోభావాలను కించపరచడమే అవుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహించారు.

maha samprokshaNam in TTD కోసం చిత్ర ఫలితంఇవన్నీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏది ఎటు పోయి ఎటు వస్తుందో అనే అందోళన టీటీడీలో మొదలైంది. పరిస్థితి చేయి దాటక ముందే అదుపులోకి తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. అయితే ఇంతటితో అయిపోయినట్టు కాదు, మహాసంప్రోక్షణ కార్య క్రమం పూర్తయ్యే దాకా టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయమూ వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందు కోసమే చాలా మంది కాచుకుని ఉన్నారు కూడా. పొరపాటు నిర్ణయాలు జరిగి ఉంటే జోక్యం చేసుకుని సూచనలు చేయాల్సింది పోయి తిరుమల ప్రతిష్ట , సెంటిమెంటు అనే వాటిని పక్కన పెట్టి మరీ దాడికి తెగబడుతున్నాయి.

maha samprokshaNam in TTD కోసం చిత్ర ఫలితం
ఇదే పాలక మండలి ఇంకా, ఇక ముందూ కొనసాగితే, హిందూ దర్మం దారి తప్పి, టిటిడిలో విద్వంసం తప్పదని సామాజిక మీడియా కోడై కూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: