Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 18, 2018 | Last Updated 4:37 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: రంగులు మార్చే రాజకీయాలతో విశ్వాసం కోల్పోయి వెలవెలపోతున్నటిడిపి

ఎడిటోరియల్: రంగులు మార్చే రాజకీయాలతో విశ్వాసం కోల్పోయి వెలవెలపోతున్నటిడిపి
ఎడిటోరియల్: రంగులు మార్చే రాజకీయాలతో విశ్వాసం కోల్పోయి వెలవెలపోతున్నటిడిపి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టిడిపి ఊసరవెల్లి రాజకీయాలు – ప్రత్యేకహోదా పై నిబద్ధత వైసిపిని రాజకీయంగానే కాదు ఎన్నికల్లో కూడా గెలిపిస్తుంది.  అసలు ప్రత్యేకహోదా తో కూడిన విభజన ప్రయోజనాలను నిలువెత్తున పాతేసి - పాతరేసి - హైదరాబాద్ నుండి ఓటుకు నోటు కేసుతో పరువు ప్రతిష్ఠ పోగొట్టుకొని పారిపోయి అమరావతికి వచ్చి బ్రతికితే బలుసాకు తినైనా బ్రతకొచ్చనే తీరుతో బ్రతికిపోయిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడెన్ని వేషాలేసినా ఎన్ని అవిశ్వాసతీర్మానాలు ప్రవేశ పెట్టినా ఆ క్రెడిట్ మొత్తం జగన్ కే పోయేది గ్యారెంటీ కారణం ప్రత్యేక హోదా చావకుండా బ్రతికించింది జగన్ మాత్రమే. దీన్ని వేరెవరూ కాదనలేరు.

ap-news-telugu-desam-party-ysr-congress 

ఇప్పుడు యూటర్న్ కథానాయకులు సాధించేదేమీ లేదు. ఇది వైసిపి జగన్మోహన రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సభలకు వెల్లువెత్తి వచ్చే అసాధారణ జనవాహినే సాక్ష్యం. ఎంతోమంది ఏమైనా మాట్లాడొచ్చు ఏదైనా సంకల్పం చేసుకొని ప్రయత్నం చేస్తే అక్కడ విజయం లభించటం తధ్యం.

 

నాలుగేళ్ల వరకు ఏ ప్రయోజనమూ రాలేదని ఎన్ డి ఏ నుండి బయటపడ్ద తరవాత చెప్పిన చంద్రబాబు అదే గొంతుతో కేంద్రంలోని బాజపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసినంత ప్రయోజనం దేశంలో ఏ ఇతర రాష్ట్రానికి చేయలేదని పలుమార్లు పలు చోట్ల ఘోషించారు. మరినేడు నాలుక మడతేసి నోటికి పని చెప్పారు చంద్రబాబు తద్వారా ప్రజల్లో ఇతర పార్టీల్లో విశ్వసనీయత కోల్పోయారు. అలాగే దీక్షల పేరుతో గత అర్ధ సంవత్సరంగా అత్యధిక ప్రజాధనం వృధా చేస్తూ చేతల్లో కూడా నమ్మకం కోల్పోయారు.

 ap-news-telugu-desam-party-ysr-congress

ఈ సందర్భంగా చంద్రబాబు తెలుగుదేశం రాష్ట్రంలో చేసిన ఊసరవెల్లి రాజకీయాలను ఒకసారి పరిశీలిద్ధాం:

 

*ఇప్పటికే అనేక విషయాలలో మాట మార్చిన తెలుగు దేశం పార్టీ మరో అంశంలో కూడా అదే బాట పట్టింది. దేశంలో ఒకేసారి లోక్-సభ ఎన్నికలు, శాసనసభల ఎన్నికలు జరగాలని గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాదించేవారు. మొత్తం ఎన్నికలలో ఆరునెలల్లో అన్ని ఎన్నికలు జరిగిపోతే ఇక అభివృద్దిపై దృష్టి పెట్ట వచ్చని అని ప్రచారం చేసేవారు. కాని ఇప్పుడు ఆయన యుటర్న్ తీసుకున్నారు. ఒకేసారి ఎన్నికలు మంచిది కాదని ఆయన నేతృత్వం లోని తెలుగు దేశం పార్టీ 'లా కమిషన్'కు లేఖ ఇచ్చింది.నాలుగు నెలల వ్యవధిలో ఎంత మార్పు. అంతేకాదు ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్దిక మంత్రి యనమల రామకృస్ణుడు చేసిన ఒక ప్రకటన కీలకంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవే విషయాలను ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చెబుతూ వస్తున్నా, యనమల ప్రకటన మరింతగా ఈ విషయాన్ని దృవీకరిస్తుంది.

 

*దేశంలోనే ఇప్పుడు అత్యంత ప్రమాదకర శక్తులు ప్రదాని నరెంద్ర మోడీ, బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా లని ఆయన తేల్చేశారు. గతంలో నరేంద్ర మోడీ తరహాలో ఎవరూ రాజకీయ కుట్రలు చేయలేదని కూడా ఆయన చెప్పారు. అంటే నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనను తాము తప్పు పట్టడం లేదని, అప్పుడు ఇన్ని కుట్రలు జరగలేదని తెలుగుదేశం రాజకీయ దృవపత్రం ఇస్తుందనేకదా అర్ధం. ఇంతకు ముందు కాంగ్రెస్ ను ఏమనేవారు ఙ్జాపకం తెచ్చుకుంటే "కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక శక్తి, సోనియా గాందీ ఇటలీ మాఫియా, ఇటలీ పుట్టిన రోజున ఆమె ఎపిని విభజించి ఆంధ్రుల పొట్ట కొట్టింది. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ ఎన్ని రకాల ప్రచారాలు చేశారో జనులందరికి తెలిసిన విషయమే. అలాంటిది మూడు నెలల వ్యవధిలో ఎంత మార్పు వచ్చింది.

 ap-news-telugu-desam-party-ysr-congress

*తెలుగు దేశం పార్టీ ఎలా రంగు మార్చేసుకుంది అనేది "కాషాయం కన్నా, మూడు రంగుల కాంగ్రెస్ బెటర్" అని పరోక్షంగా యనమల ప్రకటన తెలియిచేస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం యేమంటే - ఇంతకాలం తమిళనాడులో శశికళ, బీహారులో లాలూ యాదవ్ వంటి వారికి జైలు శిక్ష పడడానికి సమర్ధిస్తున్నట్లు మాట్లాడేవారు. కాని ప్రస్తుతం తీరుతో నాలుక మడతేసింది అదంతా "మోడీ కుట్ర రాజకీయాలకు నిదర్శనం" అని చెపుతున్నారు.

 

*తమిళనాడులో అన్నా-డి.ఎమ్.కె, బీహారులో నితీష్ కుమార్,లాలూ యాదవ్, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ, డిల్లీలో కేజ్రీవాల్, ఎపిలో తెలుగుదేశం పట్ల బిజెపి ఎలా వ్యవహరిస్తున్నదో అంతా గమనిస్తున్నారని కూడా యనమల అన్నారు. అంటే దీనర్ధం ఏమిటి? అన్నా-డి.ఎమ్.కె. ద్వారా శశికళను జైలు పంపిన ఉదంతాన్ని, ఆ తర్వాత పన్నీర్ సెల్వం, పళని సామి వర్గాలను కలపడం, బీహారులో లాలూ ని జైలుకు పంపడం, లాలూ-నితీష్ లను విడదీసి, జెడియుని తమ వైపునకు తిప్పుకోవడం వంటి వాటిని బిజెపి చేస్తోందని చెప్పడమే కదా! తెలుగుదేశంపై కూడా అలాంటి ధోరణితో బిజెపి ఉందనేది వీరి అనుమానం మరియు అభియోగం.

 ap-news-telugu-desam-party-ysr-congress

*ఆశ్చర్యంగా టిడిపి ఏ విధమైన అక్రమాలకు పాల్పడ్డారన్నదానిపై కేంద్రం వద్ద ఏ సమాచారం ఉందో కాని, నిజంగా కేంద్రం వీరిపై ఏమైనా చర్య తీసుకుంటుందో? లేదో? కాని, టిడిపి నేతలు మాత్రం భయం భయంగా ఉండడమే కాకుండా,ఎలాగొలా వాటికి వ్యతిరేకంగా ముందుగానే ప్రచారం చేస్తున్నారని తమపై బిజెపి కక్ష గట్టిందని ముందే చెప్పి ప్రజా సానుభూతిని పొందటానికి ప్రయత్నిస్తు ందను కోవాలి.


 

*మరో వైపు బిజెపి నేతలు మాటలైతే అంటున్నారు కాని ప్రస్తుతానికి చేతలదాకా వెళ్లడానికి ఏకారణం చేతో వ్యూహం తోనో వెనుకాడుతున్నారు. నాలుగేళ్లపాటు 'మోడీ-బాబు జోడి' అంటూ ప్రచారం చేసిన ఈ టిడిపి పెద్దలు, కేంద్రం నుంచి ఇంతకన్నా ఎవరైనా ఎక్కువ సాదించారని బీరాలు పోయిన నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా యుటర్న్ తీసుకుని బిజెపిని చివరకు కుట్రదారుగా తేల్చడం, ఈ సందర్భంలో ఆగర్భ శ్త్రువైన కాంగ్రెస్ ని ఒక్క మాట కూడ అనకుండా ఉండటం గమనించాలి. అంతేకాదు, గతంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ని చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకు వెళ్లి ప్రత్యేక విందు ఇచ్చిననాడు ఆయనలో ఎలాంటి కుట్రదారుడు కనిపించలేదు.

 ap-news-telugu-desam-party-ysr-congress

*తన పార్లమెంట్ సభ్యులతో పైరవీ చేయించుకుని ప్రధాని నరెంద్ర మోడీని మూడు నెలల క్రితం చంద్రబాబు కలిసినప్పుడు కూడా మోడీలో కుట్రదారుడు టిడిపికి కనిపించ లేదు. పైగా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చడానికే జిఎస్టి, జమిలీ ఎన్నికలు వంటివాటిని బిజెపి ముందుకు తెస్తుందని యనమల ఇప్పుడు అంటున్నారు.మరి జిఎస్టి బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు కాని, కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి వద్ద జరిగే జిఎస్టి మండలి సమావేశాలలో కాని ఏనాడైనా ఆయన ఈ మాట యనమల చెప్పిన దాఖలాలు కనిపించటం లేదు.

 

*వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి - వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు నాడు అడ్డగోలుగా కొనుగోలు చేశారు. అందు లోని లక్ష్యం ప్రతిపక్ష వైసిపిని బలహీనపర్చాలన్న దురుద్దేశమేనని, అది చట్ట బద్దంగా చేస్తే ఎవరూ కాదనలేరు. కాని రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సిగ్గు శరం వదిలేసి తన ఆఫీస్ లోనే విపక్ష ఎమ్మెల్యేలకు టిడిపి కండువాలు కప్పడం, ఆ తర్వాత నలుగురు విపక్ష వైసిపి ఎమ్మెల్యేలను రాజీనామాలను ఆమోదించకుండానే తన మంత్రివర్గంలో చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి కోసం నియోజకవర్గాల పెంపు కోసం విఫల విశ్వయత్నం చేశారు. కారణం ఏమైనా కాని నరెంద్ర మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేదు.

 ap-news-telugu-desam-party-ysr-congress

దాంతో కోట్లతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబుకు అత్యనత ప్రమాదకరమైన గుదిబండగా మారారు. టిడిపి బలపడుతుందనే నియోజకవర్గాలు పెంచలేదని కొన్నాళ్ల క్రితం చంద్రబాబే సభాముఖంగా అంగీకరించారు. నియోజకవర్గాల పెంపు జరగకపోవడంతో టిడిపి దెబ్బతింటోందని వారికి అర్ధం అయింది. తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడింది టిడిపి. ఈ వైఫల్యాన్ని సైతం బిజెపి ఖాతాలో నెట్టేసే నేపద్యంలో ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చడానికి బిజెపి కుట్రలు చేస్తోందని అతి తెలివిగా యనమల ముందుగానే అంటున్నారు.

 

ముందుగా టిడిపి తాను చేసిన కుట్ర రాజకీయాల గురించి వివరణ ఇచ్చి, ఆ తర్వాత బిజెపిపై ఆరోపణలు చేస్తే బాగుంటుంది. విపక్ష వైసిపిని బలహీనపర్చడం అదేదో రాజ్యాంగ పరమైన హక్కు టిడిపికి సంక్రమించినట్లు, బిజెపి మాత్రం టిడిపి జోలికి రాకూడదన్నట్లు యనమల చెబుతున్నారు. ఇదంతా బిజేపి చేయలేదా? 

 

*బిజెపితో కూరిమిలో ఉన్నన్నాళ్లు వారు ఏమి చేసినా "డూడూ బసవన్న" లాగా తల ఊపిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదని రాజనీతిఙ్జులు అంటున్నారు. దానికి తోడు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కొందరితో చంద్రబాబు రహస్య మంతనాలు జరిపారని ప్రచారం జరుగుతోంది. దానికి తగిన వేదిక తయారు చేసి అవసరమైతే కాంగ్రెస్ తో సహజీవనం చేయడానికి టిడిపి సిద్దం అవుతున్నట్లుగా యనమల ద్వారా ముందస్తు ప్రకటనగా కనిపిస్తుంది. ఇప్పుడిక  సోనియా గాంధీలో తెలుగు దేశం నేతలకు ఇటలీ మాఫియా నేతకు బదులు ఆంధ్రమాత గాని, భరతమాత గాని కనిపిస్తుందన్నా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కదా!

 ap-news-telugu-desam-party-ysr-congress

*ఇంతలా బరితెగించి తెలుగు దేశం పార్టీ ఊసరవెల్లిలాగా రంగులు మార్చగలదని టిడిపి జనమ నేరిగిన ఎన్.టి.ఆర్ కాలం నాటి పార్టీ స్థాపించిన తీరు తెలిసిన ప్రజలకు ఎవరైనా ఊహించి ఉంటారా? అసలు పాపం, ఎన్.టి.రామారావే అనుకుని ఉండరు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తన అల్లుడు తన కొంప ముంచుతారని, తన పదవినే కబ్జా చేస్తారని ఊహించలేని అమాయకుడు ఎన్.టి.ఆర్. అయితే అవేవి కుట్రలు కాదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా నరెంద్ర మోడీ కుట్రల రహస్యాన్ని చేదించినట్లు అనుభూతి చెందుతూ టిడిపి ఉంది.


ఒక సారి శీలం కోల్పోయినా పలు సార్లు కోల్పోయినా తెడా ఏముంటుంది. అందుకే సిగ్గు విడిచిన వేశ్యలాగా సంబందాలు నెలకొల్పుకుని రాజకీయాలు చేయటానికి సిద్ద మౌతున్న టిడిపికి బజార్లోని వెలయాలికి పెద్ద బేధం లేదంటున్నారు తెలుగు దేశం పార్టీ సహజ గుణమైన  ఊసరవెల్లి తీరుకు తెలిసిన ప్రజానీకం. ఆశ్చర్యపోతున్నారు మరోసారి.

ap-news-telugu-desam-party-ysr-congress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనారోగ్య సమస్య - విటమిన్లు పోషకాలు - సరైన ఆహారం
లోగుట్టు: రాఫేల్ డీల్ పై రాహుల్ గాంధి రెచ్చిపోతుంటే మన చంద్రం మౌనమెందుకు?
ఓటుకు నోటు కేసు కథానాయకునికి బుద్ధి రాలేదు - కాంగ్రెస్ వాళ్ళకు ఇక గుండే: కేసిఆర్
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకుని ....సినీనటి ప్ర‌ణీత!
చిరంజీవి + పవన్ కళ్యాన్ + కాపు ఐఖ్యత = జనసేన *  పొలిటికల్ న్యూట్రెండు కు శ్రీకారం
'తెలంగాణ పరిరక్షణ వేదిక ' అధినేతగా కోదండరాం? సీట్ల పంపకం బాధ్యత జానారెడ్దికి
స్పెషల్: రాష్ట్రం రావణకాష్టం - తారస్థాయికి బాబు స్వార్ధం & మోడీ వ్యూహం
చంద్రబాబు! లొకేష్ బాబు ఏంత గొప్ప మెధావని మంత్రిని చేశారు? పవన్ కళ్యాన్
మార్గదర్శి కేసులో రామోజీ రావు పై క్రిమినల్ చర్యలు తప్పవా?
మీడియా వీళ్ళ పెళ్ళిచేసే వరకు నిద్రపోయేలా లేదు?
ఎమెల్యే జీవన్ రెడ్డి నడవడిపై శ్రీరెడ్డి వ్యాఖ్యల తో - మసకబారనున్న టిఆరెస్ ప్రతిష్ఠ?
నాడు కమిటై అన్నీపొందిన వాళ్ళే - నేడు # Me Too అంటున్నారట-బ్లాక్ మెయిలింగ్ కాదా!
అమితాబ్ కి కూడా సెక్స్ సెగ తప్పేలా లేదు ! - సప్నా భవ్నానీ బెదిరింపు
జీవిత చరిత్రలే సోఫానాలుగా డా: కోటిరెడ్డి నిర్మించుకున్న తన ‘దుర్నిరీక్ష్య లక్ష్యం’
అచ్చేసిన ఆంబోతు మీరంటే మీరే! జివిఎల్ నరసింహరావు సీఎం రమేష్
me-Too ఏఫెక్ట్ దెబ్బ పడింది - కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ పదవి గోవిందా!
ఐఖ్య రాజ్య సమితి లో భారత్ కు ఘనవిజయం
"లక్ష్మీస్ ఎన్టీఆర్" బయోపిక్ ప్రారంభం నాడు నేడు: వర్మ సంచలనం
నోరు తెరిస్తే నీతులు తరచి చూస్తే బ్రతుకంతా బూతులే! వ్యవస్థ బలైనా 'నో ప్రాబ్లం'
ఈ కామ పిచ్చిగాళ్ళ తీట వదిలించే "మీ టూ" ఉద్యమం ఇప్పుడు చల్లారదా?
తెలంగాణా ప్రతిష్ఠకే గండికొట్టిన వీరవనిత
About the author