అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్రం లో 2003 లో స్థాపించబడ్డ “శాక్రమెంటో తెలుగు సంఘం” (టాగ్స్) కు శాక్రమెంటొ నగర పరిధిలో 3000 మంది ప్రవాసాంధ్రులు సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఏటా కర్నాటక విద్వాంసులను టాగ్స్ సంస్థ సత్కరిస్తున్నసంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగింపు లో భాగంగా 2018 సంవత్సరానికి గాను ఈ క్రింద పేర్కొనబడిన విజయవాడ వాస్థవ్యులైన విద్వాంసులకు టాగ్స్ పురస్కారాలు అందజేయబడినవి అని టాగ్స్ బోర్డు ఈ సందర్బంగా ప్రకటించింది.

1. శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారికి టాగ్స్ “జీవిత సాఫల్య పురస్కారం” ప్రదానం


2. శ్రీ కూచిభొట్ల మురళీ మోహన్ గారికి టాగ్స్ “20 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం” ప్రదానం


3. శ్రీమతి కూచిభొట్ల అపర్ణ గారు గారికి టాగ్స్ “10 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం” ప్రదానం


ప్రవాసాంధ్ర బాలుడు మాస్టర్ “నాగం విశ్రుత్” కర్నాటక సంగీత గాత్ర అరంగేట్రం జూలై 15, సాయంత్రం 5 గం. ప్రదర్శన లో భాగంగా “టాగ్స్ పురస్కార గ్రహీతలకు సన్మానం, మరియూ అవార్డులు ప్రదానం” మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం , విజయవాడ వద్ద 450 మందికి పైగా ఆహుతుల సమక్షంలో ఘనంగా జరిగింది .

sacramento telugu association awards

 ముందుగా సిలికానంధ్ర సంస్థ చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల చేతులమీదుగా నిర్విరామంగా 320 గంటలు అన్నమాచార్య కీర్తనలు పాడిన శ్రీ పప్పు సదాశివ శాస్త్రి గారికి టాగ్స్ “జీవిత సాఫల్య పురస్కారం” ప్రదానం ఘన సన్మానం గావింపబడినది. అనంతరం విశ్రాంత ఆచార్యుడు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ పద్మశ్రీ కొలకలురి ఇనాక్ చేతులమీదుగా ప్రముఖ కర్నాటక సంగీత వయొలిన్, గాత్ర విద్వాంసుడు శ్రీ కూచిభొట్ల మురళీ మోహన్ గారికి టాగ్స్ “20 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం” ప్రదానం జరిగింది. పిదప శ్రీమతి కూచిభొట్ల అపర్ణ గారికి టాగ్స్ “10 ఏండ్ల సంగీత సేవా గుర్తింపు పురస్కారం” ప్రదానం శారద కళా సమితి అధ్యక్షుడు శ్రీ శంకర రావు గారి చేతులమీదుగా అందజేయబడినది.

sacramento telugu association awards

టాగ్స్ ట్రస్టీ, టాగ్స్ మాజీ చైర్మన్, టాగ్స్ మాజీ ప్రెశిడెంట్ శ్రీ నాగం వెంకటేశ్వర రావు ఈ టాగ్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. నానాటికి కనుమరుగు అవుతున్న కర్నాటక గాత్ర సంగీతం కళాకారులకు అమెరికా – కాలిఫొర్నియా రాష్ట్రం రాజధాని శాక్రమెంటో నగరంలో జీవం పొస్తున్న టాగ్స్ సంస్థ, తెలుగు రాష్ట్రాలలో కర్నాటక గాత్ర సంగీతం విద్వాంసులకు జరిగిన సత్కార కార్యక్రమం కు మీ మీడియా ద్వారా ప్రచారం కల్పించి, కర్నాటక గాత్ర సంగీతం ను తెలుగు రాష్ట్రాలలో యధాశక్తి ప్రొత్సహించవలసిన బాధ్యత మీడియా పై ఉందని టాగ్స్ ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి గారు ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.


నానాటికి కనుమరుగు అవుతున్న కర్నాటక గాత్ర సంగీతం కళాకారులకు అమెరికా-కాలిఫొర్నియా రాష్ట్రం రాజధాని శాక్రమెంటో నగరంలో జీవం పోస్తోంది ఈ 'టాగ్స్’ అని సంస్థ ప్రెసిడెంట్ నాగ్ దొండపాటి  తెలిపారు. కాగా, అమెరికాలో కాలిఫొర్నియా రాష్ట్రం లొ 2003 లో స్థాపించబడ్డ 'శాక్రమెంటో తెలుగు సంఘం' (టాగ్స్) కు శాక్రమెంటొ నగర పరిధిలో 3000 మంది ప్రవాసాంధ్రులు సభ్యులుగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: