కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ మాటలను బట్టి తేటతెల్లమౌతుంది. టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోవడానికి తగిన వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరిస్తున్నట్లు వినోద్ కుమార్ మాటల ద్వారా తెలుస్తుంది. 


కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రయోజనాలు కోరితే తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని, విభజన చట్టం లో పేర్కొన్న హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశం లో గతం లో చెప్పినట్లే టీడీపీకి అండగా నిలుస్తామని అన్నారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని దానిని కోరడమేంటని ప్రశ్నించారు. 
no support from TRS to No Confidence Motion of TDP కోసం చిత్ర ఫలితం
ఈ వాదనను పార్లమెంటు ముందుకు తెస్తూ అవిశ్వాసంపై ఓటింగుకు దూరంగా ఉండడం లేదా అవసరమైతే అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయడం అనే వ్యూహాన్ని ఎంచుకోవాలని కేసిఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ తో పాటు శివసేన, బిజెడి తటస్థంగా ఉన్నా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవిశ్వాసా న్ని జయించే  అవకాశాలున్నాయి.
no support from TRS to No Confidence Motion of TDP tomorrow కోసం చిత్ర ఫలితం 
అయితే కెసిఆర్ ఉద్దేశం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకంగా ప్రయోజనాలు లేదా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఇప్పటికే హైదరాబాద్‌ లో  నెలకొని ఉన్న పరిశ్రమలు అమరావతికి తరలి వెళ్లే ప్రమాదం ఉందని టిఆరెస్ ఎంపి వినోద్ కుమార్ అన్నారు. 2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. 


కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇలాగే స్పందించారని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, నాలుగేళ్ల పాటు టీడీపీ-బీజేపీ మైత్రి నెరిపినప్పుడు తాము దాని గురించి అడగలేదని గుర్తు చేశారు. అవిశ్వాసంపై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించు కుంటామని ఆయన చెప్పారు. అవిశ్వాసం అంశం ఓటింగ్‌ కు వస్తుందని తాము అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
No confidence motion: TRS refuses to vote against BJP
రాష్ట్ర ప్రయోజనాలు సాధించు కోవాలంటే కేంద్ర మంత్రులు సహకరించాలని, అలాంటి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం అంటే రాష్ట్రానికే నష్టమని టీఆర్‌ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత ఎంపి  జితేందర్‌రెడ్డి అన్నారు. 


అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అయితే, ఎన్డీఎ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగా లంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదే పదే డిమాండ్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వాదననే టీఆర్ఎస్ ఎంపీ లు ఇప్పుడు వినిపించారు. టీఆర్ఎస్ ఎంపీ ల మాటలు కేసీఆర్ వైఖరిని తెలియజేస్తున్నాయి. 


రాష్ట్రానికి మేలు జరగాలంటే కేంద్రప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలని బాబు వైఎస్ జగన్మోహనరెడ్డికి సమాధానంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు కేసిఆర్ తన ఎంపీల ద్వారా అదే మాటచెప్పిస్తున్నారు.  అదే విధమైన వాదనలు చివరి నిముషంలో ఇతర పార్టీల నుండి కూడా టిడిపికి ఎదురయ్యే పరిస్థితులు పుష్కలం. 

no support from TRS to No Confidence Motion of TDP కోసం చిత్ర ఫలితం


జెసి దివాకరరెడ్ది బ్లాక్మెయిలుకు చంద్రబాబు సాగిలపడినట్టు - చంద్రబాబు అవిశ్వాసానానికి యీల్డ్ అవటానికి అక్కడ మోడీ మహామొండి. ఇదంతా టయిం వేష్ట్. దేశం, ఏపి ప్రజల దృష్టి మళ్ళించటానికి తప్ప "ఉడత ఊపులకు తోడేళ్ళు బెదరవు"  అంటున్నారు బిజెపి సీనియర్లు.


నరెంద్ర మోడీ చంద్రబాబు లాగా రాజకీయాల కొసం బ్రతకట్లేదు. ఉండవల్లి పలుసందర్భాల్లో ప్రవచించినట్లు "మోదీకి పెళ్ళామా? పిల్లలా? స్వంత వ్యాపారాలా? ఏమై పోయినా ఆయన కోల్పోయేది బూడిదే తప్ప మరేదీ కాదు" అంటున్నారు ఆయన సన్నిహిత బిజెపి సోదరులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: