టిడిపి - అధికార పార్టీ సామాజిక వర్గ మీడియా - గల్లా జయదేవ్ ను అంతగా పైకి లేపటం నిజంగా హాస్యం పుట్టిస్తుంది. నవ్వు తెప్పిస్తుంది. ఒక పత్రిక "మిస్టర్ ప్రయిం మినిస్టర్" అనటాన్ని గొప్పగా చెపుతుంది నొక్కి వక్కాణీస్తుంది.

 

ఎవరైనా సాంప్రదాయం తెలిసిన పార్లమెంటేరియన్ సభలో "అధ్యక్షా!" అంటూ సభాపతిని సంభోదించాలి తప్ప, ఒక సభ్యుణ్ణి వ్యక్తిగా కాని పదవితో గాని సంభోదించటం, సభా మర్యాద కాదని ఆ మీడియా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. 

 galla jayadev and telugu media కోసం చిత్ర ఫలితం

అంతే  కాదు భారతీయ భాషలలో ఏదైనా భాషలో మాట్లాడిటే కొందరికైనా అర్ధమౌతుంది. అవసరమైతే "ట్రాన్స్-లేషన్ ఇక్విప్మెంట్"ఉండనే ఉంది. ఆపై మీడియా వారివారి భాషల్లోకి సూర్యోదయత్పూర్వమే అనువదించి వార్తలు రాస్తుంది. ఆన్లైన్లో అప్పటికప్పుడే వార్తలు అందిస్తుంది.

 

అసలు విదేశాల్లో విద్యాభ్యాసం చేసిన ప్రతి భారతీయుడు అమెరికన్ స్లాంగ్ లో అంతకంటే బాగా మాట్లాడగలరు. ఒక్క మా బజార్లోనే ఒక ఇరవై మందికి పైగా అలా మాట్లాడ గలిగే వాళ్ళను స్వయం గా నేను చూశాను. ఐదేళ్ళ పసిపాపలు సైతం అంతకంటే బాగా మాట్లాడ గలరు. ఆంగ్ల బాషా ప్రావీణ్యం కాదు కావలసింది ప్రయోజనాల సాధన ముఖ్యం.

 

అలా వాళ్ళ వాళ్ళని అలా లేపే ఒకప్పుడు ప్రాంతీయ, భాషా, మత, కుల ఆధిపత్యం సృష్టించే "సువిశాల సమైఖ్య ఆంధ్రప్రదేశ్" ను ముక్కలు చేసింది ఎవరు? టిడిపి దాని నాయకత్వం కాదా? పచ్చ మీడియా కాదా?

galla jayadev and telugu media కోసం చిత్ర ఫలితం 

అసలీ "పైకి లేపుడు కార్యక్రమం" ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది. ఉపాఖ్యానాలు మాని వార్తలు రాయటం మెదలెట్టండి చాలు ప్రజలే అర్ధం చేసుకుంటారు. ప్రత్యెక వ్యాసాలు ఉండనే ఉన్నాయి మీ విశ్లేషణలకు. 

 

ఇక పోతే జయదేవ్ మాటల్లో 'మాట్లాడటం మీదున్న శ్రద్ధ విషయం మీద కనిపించదు' రోజూ శాసనసభలో లేదా పలువేదికలపై చంద్రబాబు చెప్పే సొద సోదే. అర్ధంకాని బాషలో ప్రావీణ్యం, మాట్లాడటం గురించి రాయటం కంటే - విషయ సాధనలోని చాకచక్యాన్ని అభినందించమని మా మనవి. ఎవరు మిన్న అన్నది కాదు ముఖ్యం. దయచేసి దాన్ని గుర్తించండి.

 

విషయంతో నరేంద్ర మోడీని వేటాడ గలిగే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. మీరు రాసే రాతలకు ముగ్ధులు అయ్యే వాళ్ళెవరూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేరు. మీ దయవల్ల తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఏ చానల్లో ఏ పత్రికలో ఏ విషయాలు ఎలా వస్తాయో ప్రచారపర్వం ఏలా కొనసాగుతుందో ముందే చెప్పెయ్య గలుగుతున్నారు.  టిడిపి మద్దతు మీడియా స్వోత్కర్షలు మాని కేంద్రాన్ని ప్రయోజనాల సాధన కు వేటాడేవాళ్లను ప్రోత్సహిస్తే మంచిది.

 

 ఒక పత్రిక రాసిన వార్త చూడండి.


“అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీ కేశినేని నాని తోనే మాట్లాడించాలని తొలుత భావించారు. అయితే, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడ గలిగే గల్లా జయదేవ్కు అవకాశం ఇవ్వడమే మంచిదని తర్వాత నిర్ణయించారు. ఇందుకు నాని కూడా అంగీకరించారు. మొదట ప్రారంభించిన వారికే చివర్లో ముగింపు అవకాశం కూడా వస్తుందని-అందువల్లే జయదేవ్ను ఎంపిక చేశామని టీడీపీ వర్గాలు తెలిపాయి. మధ్యలో మరో అవకాశం  వస్తే  దానిని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన నాయుడు కు ఇవ్వాలని నిర్ణయించారు

ఇక్కడ కేసినేని ఏమై పోవాలి. ఆయన లోని చైతన్యం చిక్కిపోవాలా? ఇక్కడ ఆంగ్ల బాష ప్రావీణ్యం ప్రాధమ్యం ఎమి అవసరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: