మంత్రి నారాయ‌ణ‌.  టీడీపీ విపక్షంలో ఉండ‌గా.. ఆర్థకంగా బ‌లోపేతం చేసి.. త‌ర్వాత ఎమ్మెల్సీ దారి గుండా మంత్రి అయిన మ‌గానుబావుడు! ఆయ‌న సీఆర్‌డీఏ ఉపాధ్య‌క్షుడుగా వెల‌గ‌బెట్టి.. ప‌టిష్ట‌మైన క‌ట్ట‌డాల్లోంచి కూడా నీళ్లు కురిపించే టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసిన మ‌హా మేధావి. తాజాగా వైసీపీ చేప‌ట్టిన రాష్ట్ర బంద్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసి..కుళ్లు రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై ఏపీలో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌రాద‌ని స‌రికొత్త ``నారాయ‌ణ రాజ్యాంగం`` రాశాడు నారాయ‌ణ‌. ఆయ‌న చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. చంద్ర‌బాబుపై కోపం వ‌స్తే.. కేసీఆర్ ను తిట్టాలి. కానీ, చంద్ర‌బాబుపై ప్రేమ రాక‌పోయినా.. వ‌చ్చిన‌ట్టు న‌టించి ఆయ‌న‌పై ప్రేమ కురిపించాలి. 

Image result for ap special status

ఇక‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టి లో పెట్టుకుని వైసీపీ ఆది నుంచి కూడా ఏపీ కోసం ఉద్య‌మాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ‌హించింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్క‌డ పార్టిసిపేట్ చేస్తే.. బ‌ల‌వంతం గా విశాఖ విమానా శ్ర‌యంలోనే నిర్బంధించి హైద‌రాబాద్‌కు పంపారు. అలాంటి వారు ఇప్పుడు ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్నామ ని,  పార్ల‌మెంటులో త‌మ‌ను మించిన నాయ‌కుడు లేడ‌ని చంద్ర‌బాబు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటుంటే.. నారాయ‌ణ నూనె రాస్తున్నాడు. వైసీపీ చేప‌ట్టిన బంద్‌పై కుళ్లు కామెంట్లు చేశాడు. జ‌గ‌న్ త‌నబంద్‌ను ఢిల్లీలో చేసుకోవాల‌ని సూచించి న‌వ్వుల పాల‌య్యాడు. ఇదేనా నువ్వు వెల‌గ‌బెట్టిన చ‌దువు.. అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. 

Image result for tdp

ప‌రీక్ష‌లు ఒక‌చోట జ‌రిగితే.. విద్యార్థి మ‌రోచోట రాస్తాడా నారాయ‌ణా? అని నెటిజ‌న్లు కురిపిస్తున్న కామెంట్ల‌కు న‌వ్వులు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనట్లు సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని..మంత్రులు,  ఎంపీలు ధర్నాలు..దీక్షలు, ధర్మపోరాటాలు చేస్తే తప్పులేదు కానీ..ప్రతిపక్షాలు మాత్రం బంద్ లు చేయకూడదట.

దానికి లాజిక్ ఏంటంటే సొంత రాష్ట్రంలో చేయకూడదట. మరి పక్క రాష్ట్రానికి పోయి చేస్తారా.. ఎవరైనా?. నిత్యం అధికార తెలుగుదేశం పార్టీనే ఏదో ఒక కార్యక్రమం పేరుతో విజయవాడ నడి వీధుల్లో  హంగామా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కానీ మిగిలిన పార్టీలు మాత్రం ఏమీ చేయకూడదట.  ఇదీ.. మంత్రి నారాయ‌ణ స‌రికొత్త రాజ్యాంగం. ఏదేమైనా.. వీరంతా రేపోమాపో బుట్ట, త‌ట్ట స‌ర్దుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదీ.. ప‌రిస్తితి. 


మరింత సమాచారం తెలుసుకోండి: