మొన్న పార్లమెంట్ లో ఎన్నడూ జరగని విధంగా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి.  ఆ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.  దీనిపై సోషల్ మీడియాలో రక రకాలుగా చర్చించుకున్నారు.  తాజాగా రాహుల్ చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే...ఇంకొందరు విమర్శిస్తున్నారు. 

ఈ విషయాన్ని బీజేపీ మాత్రం ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  స్పందిస్తూ....రాహుల్ చేసింది కేవలం ఓ పొలిటికల్ స్టంట్ అని అన్నారు. రాహుల్ కు దమ్ముంటే నన్ను హగ్ చేసుకోవాలి.  రాహుల్ వి పిల్ల చేష్టలు. ఆయనకు అంత తెలివితేటలు లేవు. సొంతంగా నిర్ణయం తీసుకోలేరు.

హుందాగా ఉండే వ్యక్తి ఎప్పుడూ ఇలాంటి పనులు చేయరు అని యోగి అన్నారు. గత ఇక రాహుల్ ను ప్రతి పక్షాలు ఎలా అంగీకరిస్తాయో అర్థం కావడం లేదు`` అని ఈ సందర్భంగా యోగి అన్నారు. అంతే కాదు ఒకవేళ ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉంటే..అఖిలేష్ యాదవ్ - మాయావతి అంగీకరిస్తారా? శరద్ పవర్ ఆయన నాయకత్వంలో పనిచేస్తారా? అంటూ విమర్శించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: