పాక్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. 272 స్థానాల్లో కౌంటింగ్ మొదలైంది. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ ఎన్ ఉంది. భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మూడో స్థానంలో ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో గెలుపుబాటలో ఉన్నారని తెలుస్తోంది.  పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ శకం ప్రారంభం కానుందా? ఎన్నికల ఫలితాలు అవుననే చెబుతున్నాయి.
pak
కాగా,  పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ దూసుకుపోతున్నది.   ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ 119 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే..క్వెట్టాలో జరిగిన దాడుల్లో సుమారు 31మంది ఓటర్లు మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడ చాలా సేపటికి వరకూ పోలింగ్ నిలిపి వేశారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్‌ సమయాన్ని పెంచారు. ఓట్ల పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు.
Image result for pakistan election 2018
ఇమ్రాన్ ఖాన్‌కు అటు సైన్యం ఆర్మీతో పాటు ఉగ్రవాద సంస్థల మద్దతు ఉండటం గమనార్హం. కాగా, పార్లమెంటులోని 272 స్థానాలకు 3,459 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.  మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 137. ఇమ్రాన్‌ పార్టీ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నా.. ఆ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. హంగ్‌కే ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వస్తేకాని ప్రభుత్వ ఏర్పాటుపై ఓ క్లారిటీ రాదంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం సీట్లు 342. వీటిలో 60 స్థానాలు మహిళలకు... 10 సీట్లు మైనారిటీలకు కేటాయించారు.
Image result for pakistan election 2018
కాని ఆ 70 స్థానాలకు ఎన్నికలు జరగవు. 272 సీట్లకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి.  కాగా, రహస్య ఓటింగ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా ఓటు వేశారంటూ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్(ఈసీపీ) సమన్లు జారీచేసింది. ఈ నెల 30న వ్యక్తిగతంగా తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఓటును రద్దు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇస్లామాబాద్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో బుధవారం ఆయన మీడియా సమక్షంలో తన ఓటుహక్కును ఉపయోగించుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: