సర్వదా శ్వేత వర్ణంలో వెకుగులు చిమ్మే చంద్రుడు, రేపు (27.07.2018) ఎర్రని ఎరుపు రంగులోకి అంటే అరుణ వర్ణంలో కంపిస్తాడు. ఈ శతాభంలోనే సుద్ధీర్ఘమైన చంద్ర గ్రహణం రేపటి శుక్రవారం నాడు ఏర్పడనుంది. ఇండియాలో జులై 27 (శుక్రవారం) రాత్రి సరిగ్గా 11.44 గంటలకు నుంచి చంద్ర గ్రహణం ప్రారంభమై 2.43 గంటల వరకు కొనసాగుతుంది  
lunar eclipse 2018 కోసం చిత్ర ఫలితం
సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించాలంటే అర్ధరాత్రి 1.51 నిరీక్షించాల్సిందే. సంపూర్ణ చంద్ర గ్రహణం, 2.43 గంటల వరకు కొనసాగుతుంది. 
2nd lunar eclipse of 2018 is 21st century’s longest
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమై,  అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడి, 103 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం కొనసాగుతుంది. అంటే శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొన సాగుతుంది. 4.58 గంటలకు చంద్రగ్రహణ ప్రభావం పూర్తిగా ముగుస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

lunar eclipse diagram కోసం చిత్ర ఫలితం

ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా, వాతావరణ ప్రభావం వలన అనేక ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు నింగిని కమ్మి ఉండటం వల్ల సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం అన్నీచోట్ల అందరికీ దక్కకపోవచ్చు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయి మహానగరాల్లో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూడొచ్చు.

lunar eclipse 2018 కోసం చిత్ర ఫలితం
శుక్రవారం ఏర్పడే చంద్రగ్రహణాన్ని చూడకుండా ఉండటం తగదు. ఎందుకంటే మళ్ళీ చూడాలంటే మన జన్మకు సాధ్యం కాదు. ఇలాంటి సుదీర్ఘ చంద్ర గ్రహణం 2123, జూన్ 9న మాత్రమే ఏర్పడుతుంది. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
lunar eclipse 2018 కోసం చిత్ర ఫలితం

ఈ చంద్ర గ్రహణానికి మరో విశిష్టత ఉంది. రేపు అంగారక గ్రహం భూమికి అత్యంత దగ్గరి కక్ష్యలోకి రానుంది. 2003 తర్వాత ఇంత దగ్గరగా వస్తుండటం ఇదే తొలిసారి. గ‌తంలో సుదీర్ఘ‌మైన చంద్ర గ్ర‌హ‌ణం 1700 సంవ‌త్స‌రాల కింద‌ట వ‌చ్చింద‌ట‌. ఇప్పుడు మ‌ళ్లీ ఈ ఏడాదే ఎక్కువ స‌మ‌యం పాటు చంద్ర గ్ర‌హ‌ణం కొన‌సాగ‌నుంది. గ్రహణం రోజున అంగారకుణ్ని వీక్షించే వీలుంది. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూసినా ఇబ్బందేం ఉండదు.  

lunar eclipse diagram కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: