గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నినాదాలే వినిపిస్తుంది.  మొన్నటి వరకు కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇస్తుందని నమ్మకం పెంచుకున్నారు.  కానీ ఈ మద్య ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అయ్యింది.  మొన్న పార్లమెంట్ లో సైతం తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు.   మరో వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్  మిగతా తెరాస నాయకులు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అని, వాళ్లకి ఇస్తే మాకు ఇవ్వాలి అంటూ, చేస్తున్న హడావిడి చూస్తున్నాం. 


ఇదంతా ఒక ఎత్తైతే..ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కి మరీ నిరసనలు తెలిపారు.  అయితే ఈ పని చేసింది ఏ ఆంధ్రుడో కాదు..అచ్చమైన తెలంగాణ యువకుడు.  దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఫైర్‌ సర్వీస్‌ కార్యాలయం వద్ద వరంగల్‌కు చెందిన యువకుడు ఉమేశ్‌రెడ్డి సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఆ యువకుడిని వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 


ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఆ యువకుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. క్రేన్ సహాయంలో పైకి ఎక్కి అతనితో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత తెలుగు తెలిసిన తెలుగు జర్నలిస్టులను పైకి తీసుకెళ్లికెళ్లి అతనితో మాట్లాడించారు.  అయితే, హోదాపై ప్రకటన చేస్తేనే దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరింపులకు గురిచేశాడు ఉమేష్. పోలీసులు, జర్నలిస్టులు ఆ యువకుడితో గంటకుపైగా చర్చలు జరిపి అతడ్ని క్షేమంగా టవర్ పైనుంచి కిందికి దించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: