వైసీపీ నుంచి గెల‌చి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు పార్టీలు మార‌డానికి గ‌ల కార‌ణాల‌ను అనేకం చెప్పారు. అభివృ ద్ధి కోస‌మే పార్టీ మారామ‌ని, చంద్ర‌బాబు చేస్తున్న మంచి ప‌నులు, అభివృద్ది వ‌ల్ల‌నే తాము పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకు న్నామ‌ని ఇలా క‌థ‌లు బాగానే చెప్పారు. కానీ, వారికి ఆ త‌ర్వాత ల‌భించిన ప‌ద‌వులు, చేసుకుంటున్న బిజినెస్‌లు చూశాక కానీ, వారు పార్టీ నుంచి ఎందుకు ఫిరాయించారో తెలియ‌లేదు! ఇప్పుడు అచ్చంగా ఇలాంటి ల‌బ్ధి కోస‌మే.. కృష్ణా జి్ల్లా పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న కూడా సొంత ల‌బ్ది కోసం పార్టీ మారిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోం ది. ఇక‌, తాను ఎలాగూ అధికార పార్టీలో ఉన్నాను కాబ‌ట్టి అడిగేవారు ఎవ‌రూ లేర‌ని ఆమె రెచ్చిపోతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఉప్పులేటి.. అదే వ‌ర్గానికి ప్ర‌భుత్వం చేస్తున్న సాయాన్ని త‌న సొంతానికి వాడుకుంటున్నారు. 


పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను ఉప్పులేటి చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో దర్జాగా వాడుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు.


అయితే రిజిస్ట్రేషన్‌ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్‌ కింద చూపితే ఎల్లో ప్లేట్‌ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్‌ ప్లేట్‌ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్‌ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్‌ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఎమ్మెల్యే ఉప్పులేటి బాగోతం చంద్ర‌బాబు దృష్టికి వెళ్లినా.. ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఇదీ.. ఫిరాయింపు ఎమ్మెల్యే స్టోరీ!! 


మరింత సమాచారం తెలుసుకోండి: