ప్రపంచ చరితో కొంత మంది చేసిన విడ్డూరాలు చూస్తుంటే..ఔరా ఇది సాద్యమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది.  తన అందమైన భార్య కోసం షాజాహాన్ చరిత్రలో నిలిచిపోయే విధంగా తాజ్ మహల్ నిర్మించాడు. ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని నిరూపించాడు బీహార్‌కు చెందిన మౌంటెన్ మ్యాన్ ద‌శ‌ర‌థ్ మాంజీ. 22 ఏళ్ల‌పాటు ఒంట‌రిగా శ్ర‌మించి త‌న గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించాడు. ప్ర‌భుత్వం, అధికారుల వ‌ల్ల సాధ్యం కాని ప‌నిని ప‌ట్టుద‌ల‌తో 22 ఏళ్ల‌పాటు శ్ర‌మించి 300 అడుగుల ఎత్తైన కొండ‌ను నిట్ట‌నిలువుగా చీల్చి ప‌క్క గ్రామానికి మార్గాన్ని వేశాడు. దానికి కారణం తన భార్య అనారోగ్యంతో ఉండగా ఆసుపత్రి వెళ్లడానికి సరైన రోడ్డు లేక ఆలస్యం కావడంతో ఆమె మరణించింది..అందుకే ఎవరికీ ఇలాంటి కష్టం కలకూడదని మాంజీ అలాచేశారు. 


తాజాగా ఇలాంటి ప్రేమ కథ ఒకటి చోట జరిగింది.. ఆర్మేనియాలోని అరింజ్ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ తన భార్య కోసం ఏకంగా భూ గర్భంలో ఓ కోటనే నిర్మించాడు. వస్తువులు దాచుకోవడానికి ఇంటి కింద చిన్న బేస్ మెంట్ కట్టాలని కోరిన భార్యకు ఆమె భర్త విచిత్రమైన బహుమతి ఇచ్చాడు. రోజూ కొంచెం కొంచెం తవ్వుతూ భూగర్భంలో ఏకంగా ఓ చిన్న కోటను నిర్మించాడు. దాన్ని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు. దీంతో ఆ నిర్మాణం ఆర్మేనియాలో ఇప్పుడు పర్యాటకులకు గమ్యస్థానంగా మారింది.


ఆర్మేనియాలోని అరింజ్ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆయన భార్య టోస్యా ఓ రోజు.. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు దాచుకోవడానికి చిన్న బేస్ మెంట్ ను నిర్మించాలని భర్తను కోరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్ల పాటు భూమిని తొలిచి, నిర్మాణాలు చేస్తూనేపోయాడు. ఇందులో భాగంగా చేతి పనిముట్ల సాయంతోనే 600 టన్నుల మట్టి, రాళ్లను తవ్వి పడేశాడు. తాను ఎన్నిసార్లు వారించినా తన భర్త వినకుండా ఓ అందమైన ప్రపంచాన్నే నిర్మించాడని అంటుంది..లెవోన్ అరకెల్యాన్ భార్య.

Image result for Arinj

 ఈ విషయమై టోస్యా మాట్లాడుతూ.. తన భర్త రోజుకు 18 గంటలు భూగర్భంలో పనిచేస్తూ ఉండేవాడని తెలిపింది. కేవలం చేతి పనిముట్ల సాయంతోనే లెవోన్ ఈ అద్భుతాన్ని సృష్టించాడని కితాబిచ్చింది. నిండా 6 వేల జనాభా లేని తమ గ్రామానికి లెవోన్ కారణంగా పర్యాటకులు వస్తున్నారని చెప్పింది.

Image result for Arinj

మరింత సమాచారం తెలుసుకోండి: