ఈ మద్య కొంత మంది ఆకతాయిలు చేస్తున్న పనులు వల్ల ఇతరులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరికొంత మంది జీవితంపై విరక్తి పుట్టి చావడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా భయాన్ని కలిగిస్తుంటాయి..అందులోనూ మన కంటి ముందే అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఊహించుకోండి. తాజాగా ఆత్మహత్య చేసుకుందామని భావించిన ఓ యువకుడు రైలు వస్తుండటాన్ని గమనించి, రైలు పట్టాలపై పడుకోగా, దాన్ని చూసిన ఇతర ప్రయాణికులు పరుగున వెళ్లి బలవంతంగా లేపి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కించిన ఘటన ముంబైలో జరిగింది.

ఈ ఘటన కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగింది.  తాజాగా సీసీ టీవిలో రికార్డు అయిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54 సంవత్సరాల నరేంద్ర దమాజీ కోటేకర్ గా గుర్తించారు. గత కొంత కాలంగా కుటుంబంలో చెలరేగుతున్న ఇబ్బందుల వల్ల ఆయన ఆత్మహత్యాప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

అతన్ని గమనించిన తోటి ప్రయాణికులు రక్షించారని, కుర్లా స్టేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. ఆపై అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం పాన్వేల్ రైల్వే స్టేషన్ లో ఇదేలా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ యువకుడిని రైల్వే పోలీసు ఒకరు రక్షించిన సంగతి తెలిసిందే.  ఫిబ్రవరి 5వ తేదీన నయీగావ్ రైల్వే స్టేషన్ లో ఓ ఐదేళ్ల బాలుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. తాజా వీడియోను మీరూ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: