గత కొంత కాలంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యారాచాలు, హత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయని..అలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.  సంజయ్ నిర్వహించే సొంత కళాశాల ‘శాంకరి’లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు పదకొండు మంది సంజయ్ పై ఈ ఆరోపణలు చేశారు.   

ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. వారు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటే.. అదే సమయంలో ఓ మేడమ్ రావడం వల్ల వదిలి పెట్టారన్నారు.  అయితే ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తం 11 మంది విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన్నారు.  హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నాయిని నర్సింహారెడ్డి.. డీజీపీ, కమిషనర్ లను రేపు వెళ్లి కలవాలని వారికి సూచించారు.  ఇదిలా ఉంటే..సంజయ్ కి చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సందర్భంగా స్పందించిన నాయిని నర్సింహారెడ్డి.. డీజీపీ, కమిషనర్ లను రేపు వెళ్లి కలవాలని వారికి సూచించారు. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని స్పష్టం చేశారు.జ


మరింత సమాచారం తెలుసుకోండి: