చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య టికెట్ పోరు రంజుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ఒక‌రికి ఇద్ద‌రు పోటీ ప‌డుతుండ‌డంతో ఇక్క విప‌క్ష రాజ‌కీయాలు నానాటికీ ముదురుతున్నాయి. ఇక్క‌డ 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాదించింది. త‌లారి ఆదిత్య ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా రు. అయితే, ఇప్పుడు వైసీపీలో ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ఆ పార్టీని గ‌ట్టెక్కించేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరులో కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన స‌త్య‌వేడులో వ‌చ్చే ఎన్నిక‌ల్లోబోణీ కొట్టాల‌ని వైసీపీ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ నుంచి ఆదిమూల‌పు సురేష్‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించారు. 
Image result for jagan
గ‌త ఎన్నిక‌ల్లో ఆదిమూలం ఘోరంగా ఓడిపోయాడు. అయితే, వ‌చ్చేఎ న్నిక‌ల్లోనూ ఆయ‌న‌నే ఇక్క‌డ పోటీ చేయించాని జ‌గ‌న్ భావించాడు. దీంతో పార్టీ ఇంచార్జుగా ఆదిమూలంనే నియ‌మించారు. ఆయ‌నే ఇక్క‌డ కొన‌సాగుతున్నారు. అయితే, గ‌త నాలుగేళ్ల‌లో ఆదిమూలం ఇక్క‌డ సాధించిన ప్ర‌గ‌తి ఏమీ క‌నిపించ‌డం లేద‌ని స్తానిక నాయ‌కులు అంటున్నారు. దీంతో ఈయ‌న‌కు టికెట్ ఇచ్చినా.. ప్ర‌యోజ‌నం అంతంత మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ లెక్కకు మిక్కిలిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న వైసీపీ నాయ‌కులు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి వచ్చే ఎన్నికల్లో సత్యవేడు నుంచీ పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. మండల స్థాయిలో వర్గాలు ఏర్పడ్డాయి. 
Image result for వైసీపీ
ఆదిమూలానికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పలువురు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సురాజ్‌, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌ తనయుడు నవీన్‌ పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. సురాజ్ ఇటీవ‌ల‌ నాగలాపురం మండలం కాళంజేరి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో ఓ ముఖ్యమైన పార్టీ తరపున పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఇవెలా వున్నా ఎన్నికల వేళ అధిష్టానం ఆదేశించిన గడప గడపకీ వైసీపీ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు మాత్రం మండల స్థాయి నాయకులు యధావిధిగా నిర్వహిస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఇక‌, ఇక్క‌డ మిగిలిన ప‌క్షాల ప‌రిస్థితి కూడా ఇంత క‌న్నా బ్యాడ్‌గానే ఉండ‌డం గ‌మ‌నార్మం. కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పెనుబాల చంద్రశేఖర్‌ మరోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలేవీ చెప్పుకోదగిన స్థాయిలో జరగడంలేదు. ఇక జనసేనకు నియోజకవర్గంలో ఎలాంటి నిర్మాణం లేదు. తిరుపతికి చెందిన బోత్‌ హరిప్రసాద్‌ నెల కిందట సమావేశం ఏర్పాటు చేస్తే పవన్‌ అభిమానులు నామమాత్రంగానే వచ్చారు. ఇక బీజేపీ ఊసే నియోజకవర్గంలో వినిపించడంలేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పోటీ.. వైసీపీ-టీడీపీల మ‌ధ్యే ఉన్న‌ప్ప‌టికీ.. గెలుపు మాత్రం ఏక ప‌క్షం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: