టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తిపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, మంత్రి క‌ళా వెంక‌ట్రావు ర‌గిలిపోతున్నా రు. ఈ నేప‌థ్యంలో పూర్తిగా పార్టీ నుంచి ప్ర‌తిభా భార‌తిని త‌రిమి కొట్టేలా క‌ళా చ‌క్రం  తిప్పుతున్నారు. అయితే, ఇది త‌న మెడ‌కే చుట్టుకోవ‌డం, అంద‌రూ మూకుమ్మ‌డిగా దాడులు చేయ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. తనను రాజకీయంగా అణగదొక్కి క్యాడర్‌ను దూరం చేస్తున్నారని, తనకు విలువ లేకుండా మంత్రి కళా వెంకటరావు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి ఇటీవల టీడీపీ సమన్వయ కమిటీ అంతర్గత సమావేశంలో నిప్పులు కక్కారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో స్పందించిన కళా అనుచ‌రులు  గడచిన కొన్ని రోజులుగా ఆమెకు వ్యతిరేకంగా వ్యుహాలు నడుపుతు న్నారు. ఆమెపై అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ ఇన్‌చార్జి బాధ్య తల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
Image result for ప్ర‌తిభా భార‌తి
రెండు రోజుల కిందట విశాఖకు వెళ్లి అక్కడ మంత్రి గంటా శ్రీనివాస రావుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారా న్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. రాజాం నియోజకవర్గంలో ముగ్గురు కళా అనుచరులను పిలిపించి హెచ్చరించాల ని నిర్ణయిం చింది. అయితే, రాజాం నియోజకవర్గంలో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకు మంత్రి కిమిడి కళా వెంకటరావు, ఆయన బంధువులు ఇబ్బంది పెడుతున్నారని రాజాం, వంగర, రేగిడి మండలాలకు చెందిన కొంద‌రు  వివరించారు. రాజాం నియోజకవర్గం లో ప్రతిభా భారతి వర్గీయులుగా ము ద్ర వేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందకుండా మంత్రి కళా, కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని కొందరు సర్పంచ్‌లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Image result for క‌ళా వెంక‌ట్రావు

మంత్రి బంధువైన కిమిడి రామకృష్ణంనాయుడు, ఆయన భార్య ఎంపీపీ వేణుసుందరం రేగిడి మండలంలో అంబరంగి, లక్ష్మీపురం, మద్దిరాముడుపేట, పెద్ద శిర్లాం, కండ్యాం తదితర పంచాయతీల్లో పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల కమిటీలను రద్దు చేసి ప్రతిపక్ష పార్టీ నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ‘నీరు-చెట్టు’ కింద మంజూరైన పనులు తమకు అందకుండా ఎంపీపీ కుటుంబ సభ్యులే చేస్తుండడంతో గ్రామాల్లో తమకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీ మారిన కళావెంకటరావును అధిష్ఠానం తిరిగి పార్టీలో చేర్చుకుని విలువ ఇస్తే ముందు నుం చీ ఉన్న తమను ఆయన ఇబ్బంది పెడుతుండ డం ఏమిటని వారు ప్రశ్నించారు. మొత్తానికి క‌ళాకు వ్య‌తిరేకంగా నాయ‌కులు మొత్తం ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: