రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల సాధ‌న అంశాలు గ‌త కొన్ని నెల‌లుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. వీటి సాధ‌న క్ర‌మంలో విప‌క్షం వైసీపీ ప్రారంభించిన ఉద్య‌మాలు, ఆందోళ‌న‌ల‌ను అధికార పార్టీ టీడీపీ కూడా అందిప‌చ్చుకుంది. అంతేకాదు, ఈ పోరు ప్ర‌భావం వైసీపీకి ఎక్క‌డ ల‌బ్ధి చేకూరుతుందోన‌ని టీడీపీ వ్యూహాత్మ కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ధ‌ర్మ పోరాటం అంటూ కొత్త‌ప‌ల్ల‌వి అందుకుని ఏకంగా సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు ఏప్రిల్ 20న విజ‌య‌వాడ‌లో ఉద‌యం ఏడు నుంచి రాత్రి ఏడు గంట‌ల వ‌ర‌కు ధ‌ర్మ పోరాట దీక్ష‌కు కూర్చున్నారు. ఇక‌, త‌న ఎంపీల‌తో అవిశ్వాసం ప్ర‌క‌టించారు(ఇది కూడా జ‌గ‌న్‌ను కాపీ కొట్టిందే). అయినా సాధించింది లేదు. పైగా యూట‌ర్న్ చంద్ర‌బాబు అనే వ్యాఖ్య‌లు  దేశ‌వ్యాప్తంగా వినిపించేలా చేసుకున్నారు. 


ఇక‌, ఇప్పుడు ఆయ‌న చెబుతున్న కొత్త మాట ఈ పోరాటంలో తామే ముందున్నామ‌ని! నిజానికి అధికారంలో ఉన్న‌వారు రోడ్డెక్కుతారా? ప‌నులు చేస్తారా? అనే విష‌యాల‌ను ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్ర‌బాబు మ‌రిచిపోతు న్నారు. రాష్ట్రానికి అండ గా ఉంటారని బీజేపీతో కలిసి పోటీ చేశాం.. ఎన్‌డీఏలో భాగస్వామిగా చేరాం.. అయితే కేంద్రం మనకు తీవ్ర అన్యాయం చేసింది.. దానిపై ధర్మపోరాటం చేస్తున్నాం.. ఇందులో అంతిమ విజయం మనదే’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  ‘రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ తీరని అన్యాయం చే స్తే... ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేసింది. కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదు.  జరుగుతున్న పరిణామాల ను..  రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని.. ఎవరెవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనించాలి’ అని క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు. 


వాస్త‌వానికి చంద్ర‌బాబు చేసిన ప‌నుల‌ను ప్ర‌జ‌లు ఎప్పుడూ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. వ‌ద్ద‌ని నెత్తీ నోరూ బాదుకున్నా రాష్ట్రాన్ని విభ‌జించారు. క‌నీసం ప్ర‌త్యేక హోదా అయినా కావాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఘోషించిన‌ప్పుడు.. హోదా అంటే తంతా అని ఈ నోటితోనే చంద్ర‌బాబు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల‌ను, ఉద్య‌మ‌కారుల‌ను అణిచి వేశారు. దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. ఇక‌,  ఇదే కంటిన్యూ అయితే, ఓట‌మి త‌థ్య‌మ‌ని గ్ర‌హించి యూట‌ర్న్ తీసుకుని హోదాతోనే మేల‌ని ధ‌ర్మ‌పోరాట‌మ‌ని, దీక్ష‌ల‌ని కొత్త తెర‌లెత్తారు. ఇవి కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. అధికారంలో ఉన్న నాయ‌కులు ప్ర‌జ‌లకు చేయాల్సింది పోరాటాలు, దీక్ష‌ల ద్వారా గెయిన్లు కావు! ప్ర‌జ‌లు మేలు చేయాలి. అధికారం చేతిలో ఉంచుకుని, కేంద్రంతో నాలుగేళ్ల పాటు కాపురం చేసి ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తుండ‌డం ఏ రీతి రాజ‌కీయ‌మో చంద్ర‌బాబే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: