జిల్లాలోని పీలేరులో ముప్పయ్యేళ్ల మహిళా డాక్టర్ శిల్ప అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంట్లో ఉరేసుకొని ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. గతంలో తిరుపతి రుయాలో పీజీ చేస్తుండగా శిల్పాకు వేధింపులు వచ్చాయి. డాక్టర్ల వేధింపులపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వేధింపులు తీవ్ర తరం కావడంతో ఆమె మనోవేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది.  కాగా, డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై ఆమె సోదరి కృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Image result for డాక్టర్ శిల్ప
ప్రొఫెసర్ రవి కుమార్, డాక్టర్ శివకుమార్‌లపై ఫిర్యాదు చేశారు. రవికుమార్, శివకుమార్‌ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే..తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో పని చేయనున్న ఈ విచారణ బృందంలో ఒక మహిళా ఇన్ స్పెక్టర్, నలుగురు ఇన్ స్పెక్టర్లు సభ్యులుగా వున్నారు. కాగా, శిల్ప ఆత్మహత్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
Image result for డాక్టర్ శిల్ప
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.  తమను ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని, కీచక ప్రొఫెసర్ రవి ఆగడాలపై ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు  శిల్ప మానసిక పరిస్థితి బాగోలేదని అభాండాలు వేయడం దారుణమని మహిళా సంఘాలు మండిపడ్డాయి.  బాధిత విద్యార్థినులపై ప్రొఫెసర్లు అభాండాలు వేయడం దారుణమని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: