నేడు తెలంగాణకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ రానున్న విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ఆయన గత కొంత కాంత కాలంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రాహూల్ గాంధీ తనదైన ప్రచారం చేస్తూ జనాలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.  ఈమద్య పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ని కౌగిలించుకోవడం..కన్ను కొట్టడటం ఎన్నో సంచలనాలు రేపింది. 

తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు కన్నుగీటారు. రాజస్థాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జైపూర్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా రాహూల్ గాంధీ మరో గమ్మత్తు చేశారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను చూసి కన్ను గీటారు.

ఆ వెంటనే సచిన్ పైలట్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ దగ్గరికెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో పసలేదని చెప్పే ప్రయత్నం చేశారు.   కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తిచేసి వెళ్లి ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్నారు.  రాహుల్ కన్ను గీటడం మరోమారు వైరల్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: