అఖిల భారతీయ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం, మంగళవారం రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాక తొలిసారి రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది.   

Image result for rahul gandhi telangana

రాహుల్‌కు స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వెళ్తున్న క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అనుమతించలేదు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు అనుమతించిన జాబితాలో జైపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో.. ఆయన్ను లోపలికి రానివ్వలేదు. దీంతో చేసేదేమి లేక హౌజ్ టెర్మినల్ వద్దే ఉండిపోయారాయన.

Image result for rahul gandhi telangana

జైపాల్ రెడ్డితో పాటు మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డిలు కూడా టెర్మినల్ వద్దే ఆగిపోయారు.రాహుల్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం లోపలికి వెళ్లినవాళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఐదుగురు సీనియర్ నేతలు, ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు జాతీయ కార్యదర్శులు ఉన్నట్టు సమాచారం.


కాగా,  వీవీఐపీ టెర్మినల్‌కు 2 కిలోమీటర్ల దూరం వరకే పోలీసులు కాంగ్రెస్‌ నేతలకు అనుమతినిచ్చారు. రాహుల్‌ పర్యటన సందర్భంగా శంషాబాద్‌కు 500 బైక్‌లతో ర్యాలీ వెళ్లాలనుకున్న పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: