వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటిలో పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నారు. కానీ, ఇప్ప‌టికీ ఆయ ఉత్త‌రాంధ్ర‌పైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. ఇత‌ర పార్టీల నుంచి పెద్ద‌గా వ‌ల‌స‌లు కూడా క‌నిపించ‌డం లేదు. ఒక్క‌రో ఇద్ద‌రో వ‌స్తే వారు కూడా గ‌త ప్ర‌జారాజ్యం పార్టీకి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రు ఇత‌ర రంగాల‌కు చెందిన వారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులను ప‌వ‌న్ ఎలా బ‌రిలోకి దింపుతారో..? ఎవ‌రిని పోటీలో నిల‌బెడుతారో తెలియ‌డం లేదు. అయితే ఈ విష‌యంలో మాత్రం ఓ టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన త‌రుపున సెల‌బ్రిటీలు రంగంలోకి దిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

Image result for ali comedy

ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా ప‌వ‌న్ మిత్రులు అయిన‌ హాస్య‌న‌టుడు అలీతోపాటు తాళ్లూరి రామ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో మ‌రికొంద‌రు కూడా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.  తాజాగా మరో సెలబ్రెటీ పేరు జనసేన అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. అతను ఎవ‌రంటే.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.. అల్లు అరవింద్ నిర్మాణ వ్యవహరాలన్నీ దగ్గరుండి చూసుకునే బన్నీ వాస్ కావ‌డం గ‌మ‌నార్హం. అతను జనసేన తరఫున పాలకొల్లు టికెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అల్లు అరవింద్ కూడా అప్పుడే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అయితే, పాలకొల్లు చిరంజీవి సొంత నియోజకవర్గం. ఇక్క‌డి నుంచి చిరు 2009 ఎన్నికల్లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం బన్నీ వాస్ ను బ‌రిలోకి దింపి పిలిపించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో  మెగా ఫ్యామిలీ ఉంద‌ట‌.


పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి మంచి ప‌ట్టుంది. ఇక్క‌డ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేను ఎదుర్కోవ‌డం అంత సులువు కాదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీ-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి, ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొన్నారు. కానీ, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పిన త‌ర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అదే సమ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ప‌వ‌న్ తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏపీకి హ‌క్కులు సాధించ‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌యం అయ్యార‌నీ, భారీగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు. నిజానికి ఆయ‌న టీడీపీనే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాల‌కొల్లు ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి మ‌రి. 

Image result for బన్నీ వాస్

ఇక బ‌న్నీ వాస్ ప్ర‌య‌త్నాలు ఇలా ఉంటే అదే సీటు నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త చేగొండి హ‌రిరామ‌య్య జోగ‌య్య త‌న‌యుడు చేగొండి సూర్య‌ప్ర‌కాష్ కూడా ఇటీవ‌లే జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పాల‌కొల్లులో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో పాల‌కొల్లు జ‌న‌సేన అభ్య‌ర్థి ఎవ‌రు ? అవుతారో ?  కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: