Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న భరతమాత ముద్దుబిడ్డ ధన్యజీవి అటల్ బిహారీ వాజపేయీ!

సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న భరతమాత ముద్దుబిడ్డ ధన్యజీవి అటల్ బిహారీ వాజపేయీ!
సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న భరతమాత ముద్దుబిడ్డ ధన్యజీవి అటల్ బిహారీ వాజపేయీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత స్వాతంత్రానంతరం పదేళ్ళకు లోక్-సభ లోకి అడుగెట్టిన భారత రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని,  భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) నేడు తుదిశ్వాస తీసుకున్నారు.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

A B Vajapayee was only a child witness, who was not born into any family of blue blood

గత కొంతకాలంగా డిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు మనో వైకల్యం  (డెమెన్షియా) తో ఆయన కొంత కాలంగా బాధపడు తున్నారు.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్స్ ద్వారా జీవధారను అందిస్తూ వచ్చారు.


ఏడాదికి 12 పౌర్ణమిల చొప్పున 82 ఏళ్లకుపైగా జీవించిన వ్యక్తి తన జీవిత కాలంలో వెయ్యి పౌర్ణిమలను చూస్తాడని భావిస్తారు. చంద్ర రథారోహణ్‌ అని కూడా పిలిచే సహస్ర చంద్ర దర్శన్‌ను 82 లేదా 83వ ఏట నిర్వహిస్తారు. వాజ్‌పేయి సహస్ర చంద్ర దర్శన్ పూర్తి చేసు కున్న సందర్భంగా, నాటి ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి కలాం, బీజేపీ నేతలు ఆయన్ను నాడే కలసి అభినందించారు

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి కృష్ణా దేవి మరియు తండ్రి కృష్ణ బిహారీ వాజపేయి. ఒక ఉపాధ్యాయుడు మరియు కవి ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనా కు వలస వెళ్ళారు.


వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల) లో చేరి హిందీ,ఆంగ్లము మరియు సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజ యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్య క్రమాలను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు.


ఆయన 1947 లో "పూర్తి స్థాయి సేవకుడు" అనగా ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ యొక్క విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ పంపబడ్డ వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న "రాష్ట్రధర్మ" (హిందీ మాస పత్రిక), "పాంచజన్య" (హిందీ వార పత్రిక) పత్రికలు మరియు స్వదేశ్" మరియు "వీర్ అర్జున్" వంటి దిన పత్రికలలో పని చేయటం ప్రారంభించాడు. వాజపేయి జీవితాంతం వివాహమాడకుండా బ్రహ్మచారిగాజీవించారు.


1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.


national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram 

*1975 నుండి 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రేస్ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు కాబడినారు.

*1977 లో సంఘ సంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్ ను క్రొత్తగా యేర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశారు.

*1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గం లో విదేశీ వ్యవహారాల శాఖామాత్యులుగా పనిచేశారు.

*విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.

*1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజపేయి, స్వతంత్రంగా గౌరవప్రథమైన రాజకీయ వేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగాడు 1979లో మొరార్జీదేశాయ్ ప్రధాన మంత్రిగా రాజీనామా చేసిన కొద్దిరోజులకే జనతాపార్టీ కూడా విఛ్ఛిన్నమైపోయింది.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

*జనసంఘ్ నాయకులను జనతాపార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా, జనతా పార్టీలోని వివిధ వర్గాల యొక్క అంతర్గత విభేదాలవల్ల విసిగిపోయి సంకీర్ణంలోనుండి బయటకు వచ్చింది.

*వాజపేయి, జనసంఘ్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి వచ్చిన తన సహచరు లను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ మరియు భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980లో భారతీయ జనతా పార్టీని  యేర్పరచారు.

*ఆ తర్వాత ఆయన బి.జె.పి యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రేస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించారు.

*భారతీయ జనతాపార్టీ, పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్నవేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతి రేకించినా, ఆ పరిస్థితికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యొక్క "విభజన మరియు అవినీతి రాజకీయాలు జాతీయ సమైక్యత మరియు సమగ్రతలకు ఫణంగా పెట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి" అని ఆరోపించింది.

*భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లు స్టార్ ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగ రక్షకుల చే ఇందిరాగాంధీ హత్యకు గురైన తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది.

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

*1984 ఎన్నికలలో బి.జె.పి లోక్‌సభలో రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా మరియు విపక్ష నాయకునిగా కొనసాగారు.

*అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, విశ్వహిందూ పరిషత్ మరియు ఆర్.ఎస్.ఎస్ కార్య కర్తలు కలసి చేపట్టిన రామ జన్మభూమి మందిర ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ గళం వాజపేయీ ఇచ్చిందే.

*1995 మార్చిలో గుజరాత్ మరియు మహారాష్ట్రలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయాన్ని సాధించింది.1994లో కర్ణాటకలో జరిగిన అసెంభ్లీ ఎన్నికలలో మంచి విజయాలను సాధించింది. ఈ విధంగా జాతీయస్థాయిలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

*1995 నవంబరులో ముంబాయిలో జరిగిన బి.జె.పి సమావేశంలో బి.జె.పి అధ్యక్షుడైన లాల్ కృష్ణ అద్వానీ వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు.

*1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బి.జె.పి విజయం సాధించింది

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram

national-news-atal-bihari-vajapeyee-mahabhinshkram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపధ్యం ఏమై ఉండొచ్చు?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
సంపాదకీయం: దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు - తల్లిని చూపుతూ మోడీపై విమర్శలు చేయటమా?
“జస్ట్ ఝలక్‌”  స్వీటీ న్యూ-లుక్‌:  నిర్మాత కామెంట్
చింతమనేని - ఇంటికివెళ్ళిన అమ్మాయిలు మాయం!
'చాయ్‌ వాలా పోస్టర్' - టీడీపీపై ఫైర్
డిల్లీ దీక్షకు టిడిపి వారితో ప్రత్యేక విమానంలో తరలివెళ్ళిన బిజెపి హరిబాబు: విజయ్ సాయిరెడ్డి
ఎడిటోరియల్:  బాబు వారసుని కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఏపి ప్రజలకి ఉందా? అది వారే ఆలోచించుకోవాలి?
స‌న్నాజాజి మళ్ళీ  పుట్టిందా! న్యూ అనుష్క షెట్టి - ఫోటో-షూట్
About the author