ఎవరైనా రాజకీయ నాయకులు, దేశభక్తి  పరులే కాదు, దేశమంటే గౌరవమున్న సాధారణ పౌరుడు సైతం, తమకు అవకాశం వస్తే  ప్రజా సమూహాలను సందర్శించి ఉపన్యాసమిచ్చే అవకాశం ఉంటే, అదీ దేశానికి అత్యంత ముఖ్యమైన రోజుల్లో, అంటే స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధి జయంతి, అంబెడ్కర్ జయంతి తదితర సందర్భాలైతే మరీ ముఖ్యంగా వదులుకోరు.

 

తాతతండ్రుల వారసత్వంతోనో, దొడ్డిదారినో, అప్పనంగా పదవిలోకి వచ్చినవాళ్ళకు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధి జయంతి, అంబెడ్కర్ జయంతి లాంటి పర్వదినాల ప్రాముఖ్యత తెలియదు అంతేకాదు వాటి వెనకనున్న చరిత్ర, భావావేశాలు అంతకన్నా తెలియదు. అలాంటివాళ్ళు ప్రజాజీవితంలోకి రాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ రాజకీయ అవకాశాల కోసం పదవీ వ్యామోహం తో కక్కుర్తి పడితే కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే నన్నా కొంచెమైనా గౌరవం మిగులుతుంది.

 flag hoisting on terrace by nara brahmini కోసం చిత్ర ఫలితం

"స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మహనీయుడు జాతికి భాగ్యవిధాత మంత్రి లోకేశ్‌  తప్ప ప్రపంచంలో ఏ ఒక్కరూ కనిపించరు. ఇది తీవ్ర అధికార దుర్వినియోగానికి, లేదా అహంభావానికి, అహంకారానికి ప్రభలమైన ఋజువుగా చెప్పొచ్చు"

 flag hoisting on terrace by nara brahmini కోసం చిత్ర ఫలితం

మంత్రి నారా లోకేష్  ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం మంత్రి హోదాలో జెండా వంద‌నం చేయ‌టంలో త‌ప్పేమీలేదు. కానీ మంత్రి హోదాలో ఉండి, అది కూడా ఇంటి మేడ మీదే జెండా వంద‌నం  చేయ‌టం క‌చ్చితంగా జాతిని జెండాను అవమానపరచటమే అంటున్నారు. అయితే ఇంటి ముందు ప్రాంగ‌ణంలోనే జెండా ఎగుర‌వేయ‌వ‌చ్చు. ఎందుకంటే ఇరుగుపొరుగు వారైనా ఆ పవిత్ర కార్యక్రమానికి హాజరు అవుతారు. తనకు అంత అనుకూలంగా లేకపోతే తను మంత్రిగా స‌చివాల‌యంలో జ‌రిగే జెండా పండుగ‌కు హాజ‌రు కావ‌చ్చు. అదీ కుదరకపోతే రాష్ట్ర‌ పార్టీ కార్యాల‌యంలో కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అటువంటి గౌరవాన్ని ఆపాదించే అన్నీ కార్యక్రమాలను ప‌క్క‌న‌పెట్టేసి ఇంట్లో మేడ మీదే అది కూడా భార్య నారా బ్రాహ్మ‌ణి, కొడుకు దేవాన్ష్ తో క‌లిసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తూ జెండా వంద‌నం చేయ‌టం ఎంతటి గొప్పవారికైనా గౌరవం ఆపాదించదు సరికదా అగౌరవాన్ని ఆపాదిస్తూ వివాదాస్ప‌ద‌మౌతుంది.

 rahul meeting industrialists in hyderabad కోసం చిత్ర ఫలితం

ఇంటి టెర్రేస్ మీదే జెండా వంద‌నం చేయ‌టాన్ని అంద‌రూ త‌ప్పు ప‌డుతున్న స‌మ‌యంలోనే త‌న భార్య బ్రాహ్మ‌ణి  పోలీసు గౌర‌వవంద‌నం స్వీక‌రించ‌టానికి రాజ్యాంగ‌ బ‌ద్ద‌మైన అర్హతలేమున్నాయనేది మరింత వివాదాస్పదమౌతుంది. బ్రాహ్మ‌ణి ఏ విధంగా పోలీసు గౌర‌వవంద‌నం స్వీక‌రిస్తారు. ఆమెకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, మంత్రి భార్య అన్న హోదాతో గౌరవవందనం స్వీకరించవచ్చని రాజ్యాంగం చెపుతుందా? ఇంత త‌ప్పు జ‌రిగినా మెజారిటీ మీడియాకు ఇవేవీ ప‌ట్ట‌ లేదు. అదేదో వారి హక్కులా వారెన్ చేసినా వీరేన్ రాసినా రాష్ట్రంలో చెల్లుబాటౌతుందనే అధికారం పదవి ఇచ్చిన అహంకారమా? ప్రజల్లో అనేక వ్యఖ్యానాలు వారి రాజకీయ పరిణితిని మల్టిప్లై చేస్తుంది. మహానాయకుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు గారి వారసులు ఇలా కుక్కమూతి పిందెలుగా మారటం జాతి సహించగలదా? కనీసం ఆయన స్థపించిన తెలుగుదేశం పార్టీ ప్రజలు సహించగలరా?

rahul meeting industrialists in hyderabad కోసం చిత్ర ఫలితంఈ సందర్భంగా వైసిపి నాయకుడు విజయసాయిరెడ్డి ఇలా ట్వీట్ చేశారు. "ఏపీ మంత్రి నారా లోకేష్ సోమరి అని (బద్ధకస్తుడని) అదే సోమరి తనంతో ఇంటిపై కప్పుపైనే జాతీయ జెండా ఎగురవేశారు" బుధవారం ఆయన ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు. "స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్‌ నాయుడు మాత్రమే నని ఇది ఆయన తారస్థాయికి చేరిన బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం" అని ట్వీట్‌ చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

 vijaya sai reddy కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి కోడలు మంత్రి గారి సతీమణి నారా బ్రహ్మణిని కలవడంపై కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాహుల్‌ గాంధీకి నీచరాజకీయాలు మాత్రమే తెలుసని, ఎంతకైనా దిగజారతారని తెలియజేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి  పదవిచ్యుతుడైన నాడే ఆంధ్రప్రదేశ్ కు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆయన అభిప్రాయపడ్డారు.

NTR Indira Gandhi rivalry కోసం చిత్ర ఫలితం 

ఇక్కడ ఆలోచించవలసింది కనీసం బ్రహ్మిణికైనా తన మాతామహులు స్థాపించిన పార్టీకి నైతిక సాంసృతిక సాంప్రదాయక జవసత్వాలివ్వగలరని చాలామంది తెలుగు ప్రజలు ఆశించారు. కాని తనకు లేని తనకు తగని తనకు అర్హతలేని సైనిక వందనం స్వీకరించటం లోనే ఆమె కూడా "నారా వారి తానులోని ఒక ముక్క" మాత్రమేనని అనిపిస్తుంది.  అంతేకాదు టిడిపి తల్లివేరైన తెలుగుజాతి ఆత్మగౌరవం పౌరుషం మొదలైన వాటిని కాంగ్రెస్ అధ్యక్షుల పాదాల చెంత పెట్టటానికి అందరికంటే ముందుండేలా ఉన్నారని విశేషకులు భావిస్తున్నారు.

Congress & NTR కోసం చిత్ర ఫలితం

కష్టపడి తెలుగు అభిమానులు, ఆత్మగౌరవంతో నందమూరి సారధ్యంలో నిర్మించుకున్న సౌధం "తెలుగుదేశం పార్టీ" చీమలు కష్టించి పెట్టుకున్న పుట్ట. దాంట్లోకి ఏ భావోద్వేగాలు, రాగ అనురాగాలు ఈ రాజకీయ వ్యాపారికి ఉండవని అందుకే కాలసర్పాల్ల ఆ చీమలు పెట్టిన పుట్టల్లో జొరబడ్దాయని అంటున్నారంతా. 

మరింత సమాచారం తెలుసుకోండి: