రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వారసులు రెడీ అయ్యారు. పార్టీ అంతర్గత విషయాల నుంచి అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు వరకు అన్నింట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తమదైన మార్కును చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధినేతల కంటే ముందే ప్రకటిస్తున్నారు. మొన్న కర్నూలులో ఏపీ మంత్రి లోకేశ్ కీలకవ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి మోహన్‌రెడ్డికే సీటు కేటాయిస్తామని చెప్పారు. దీంతో ఇక్క‌డ టిక్కెట్ ఆశిస్తోన్న టీజీ భ‌ర‌త్ వ‌ర్గం భ‌గ్గుమంది.

Image result for ktr nara lokesh

తాజాగా కరీంనగర్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి తెరలేపారు. ఇటీవల నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల నగారా మోగించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సెప్టెంబర్ నెలలోనే తమ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలోనే పార్టీ తరపున భారీ స్థాయిలో ప్రగతి నివేదన సభను నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.


అయితే కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తండ్రి కంటే ఒకడుగు ముందుకు వేసి ముందే అభ్యర్థిని ప్రకటించాడు. మంళవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యల వెనక మర్మం ఏమిటనే ప్రచారం జరుగుతోంది. 

Image result for telangana

టీఆర్ ఎస్ పార్టీ తరపున అధ్యక్షుడి హోదాలో అభ్యర్థులను తాను ఖరారు చేస్తానని కేసీఆర్ వెల్లడిస్తే అంతకుముందే ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ క్యాండిడేట్ లను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే సీఎం కేసీఆర్ ఏం చేస్తారనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు రాబోయే కాలంలో మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో కీలకం కానున్నారనే, ఆయన చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: