ఈ మద్య వర్షాలు జోరుగా కురుస్తున్నాయి..కేరళా రాష్ట్రం అయితే ఏకంగా జలదిగ్భందంలో ఉన్న విషయం తెలిసిందే.  ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి.  ముఖ్యంగా ఏపిలో వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకమేర్పడింది. పశ్చిమగోదావరిజిల్లా పోలవరంలో గోదావరి ఉద్థృతంగా ప్రవహిస్తోంది ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో పోలవరం కడెమ్మ వంతెన పూర్తిగా నీటమునిగింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు రవాణా మార్గం పూర్తిగా మూసుకుపోయింది. 

Image result for పోలవరంలోకి నీరు

 ప్రాజెక్టు పనులు చేస్తున్న త్రివేణి క్యాంపులో దాదాపు 4వేల అడుగుల మేర వరద నీరు వచ్చి చేరడంతో సామగ్రి నీట మునిగింది. అలాగే, ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన స్పిల్‌వే, స్పిల్ చానల్ చుట్టూ 9 అడుగుల మేర వరద చేరింది.  ప్రాజెక్ట్ స్పిల్ ఛానల్ కు వరద నీరు పొటెత్తడంతో పనులు నిలిచిపోయాయి. కొత్తూరు కాజ్ వే పైకి పది అడుగులు మేర నీరు చేరడంతో సమీపంలోని 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

Image result for పోలవరంలోకి నీరు

వర్షం ఉధృతి ఎక్కువ కావడంతో   స్పిల్ వేలోకి నీరు రాకుండా భారీ డంపర్లు, ఎక్స్‌కవేటర్లతో పది అడుగుల ఎత్తున పెద్ద మట్టి గుట్ట పేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికుల కోసం ఎగువ భాగంలో గతంలో వేసిన క్యాంపుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో అందులో చిక్కుకున్న మూడు వేల మందిని ఖాళీ చేయించారు.  కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను గోదావరి వరద ముంచెత్తింది. వేలేరుపాడు మండలంలో ఇప్పటికే ఐదు గ్రామాలను ఖాళీ చేయించారు. సాయంత్రానికి వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: