Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 6:54 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: వ్యవహారాల్లో చంద్ర వర్సెస్ చంద్ర - ఇద్దరు చంద్రులు తీరు

ఎడిటోరియల్: వ్యవహారాల్లో చంద్ర వర్సెస్ చంద్ర - ఇద్దరు చంద్రులు తీరు
ఎడిటోరియల్: వ్యవహారాల్లో చంద్ర వర్సెస్ చంద్ర - ఇద్దరు చంద్రులు తీరు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ap-news-telangana-news-chandrababu-kcr-style-while
దాని జన్మమే కాంగ్రెస్ వ్యతిరెఖం. తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణే ప్రధానంగా, వారి అత్మాభిమనం ఉగ్రరూపం దాల్చగా, కాంగ్రెస్ అధినేతల నియంతృత్వానికి చెంప పెట్టుగా ఆంధ్రుల దైవం నందమూరి తారకరామారావు నాయకత్వంలో జన్మించిన పార్టీ తెలుగు దేశం. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఇతర నాయకులతో సమావేశమై “కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని?” అడిగారు. 


దానికి ఆ పార్టీతో, ఆ సిద్ధాంతాలతో, పుట్టిపెరిగి ఈ స్థాయికి వచ్చిన కొందరు సీనియర్లు తమ పూర్తి అభ్యంతరం చెప్పారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకమే ఒక సిద్ధాంతంగా పుట్టి దాదాపు మూడున్నర దశాబ్ధాల పైగా అప్రతిహతంగా నిలిచి కాంగ్రెస్ ను "ఢీ" కొడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ టిడిపి తమ రాజకీయాల అవసరం కోసం ఆత్మగౌరవం ఆత్మాభిమానం పాతరేసి అదే కాంగ్రెస్ పార్టీతో కలవడం ఆ అనుభవఙ్జులైన నాయకులకు ఒక పట్టాన గరళం తాగినట్టు అనిఒఇంచి ఉండవచ్చు.


అందులోనూ “దక్షిణాదిన సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా నిర్దాక్షిణ్యంగా విభజించిన పాపం ఇంకా కాంగ్రెస్ మెడలోమూర్చరోగికి ఉన్నట్టు ముద్ర హారంలా పడిపోయింది.  అలాంటి పార్టీతో పొత్తుకుంటే ఆంధ్రుల మనసులోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ఇది సమయోచితం కాదని, సిగ్గుమాలిన పని అని కొందరు సీనియర్లు నిర్మొహమాటంగా చంద్రబాబుతో అన్నారట. 


చంద్రబాబు సహజస్వభావం కాంగ్రెస్ నుండి సంతరించుకున్న నియంతృత్వమే. అందుకే ఒంటెద్దు పోకడతో “టిడిపిని కాంగ్రెస్ తో పొత్తుకు నిర్ణయం” తీసు కున్న తరవాతే -వారి అభిప్రాయాలను మాటవరసకు తెలుసుకున్నారనేది వారికి తెలియదు పాపం!  అప్పటికే తాను కాంగ్రెస్ తో పొత్తుకు నిర్ణయం తీసుకున్న చంద్ర బాబు వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోగా, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత పోయే విధంగా "తన బాకా పచ్చ మీడియా గొట్టాలు, కరపత్రాలు” వినియోగిస్తూ తద్వారా కాంగ్రెస్ పై సానుకూలత తెచ్చే బాధ్యత నాది అంటూ బాధ్యత తీసుకున్నారని తెలుస్తుంది. ఇక పచ్చ మీడియా కాంగ్రెస్ మంచితనం గుఱించి ఊకదంపుడు మొదలెట్టి వార్తలు వక్రీకరించబోతుందని తెలుస్తుంది. 


దీంతో ఎప్పటిలా చంద్రబాబు 'నిర్ణయం తీసుకునే తమను అడగాలి కాబట్టి తమను అడిగారని' అర్థం చేసుకున్న నేతలు, మీ ఇష్టం సార్ – తుదినిర్ణయం అధినేతగా మీదే అంటూ  “సిగ్గుమాలిన ఆ నిర్ణయాధికారం” ఆయనకే వదిలేశారని అమరావతి సమాచారం. కాంగ్రెస్ - టీడీపీ పొత్తు అధికారిక ప్రకటన రావటమే తరువాయి. ఈ పొత్తు పట్ల అయిష్టత తో ఉన్న పార్టీవర్గాల నుంచి ఈ సమాచారం బయటకు వచ్చి మార్మోగుతుంది. ఏ పార్టీని అభిమానించని తటస్థులకు కూడా ఈ నిర్ణయం చేదు మాత్రే.

ap-news-telangana-news-chandrababu-kcr-style-while
ఇక తెలంగాణా విషయానికి వస్తే నిన్న బుధవారం కేసీఆర్ అత్యవసర మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల ముందు డిల్లీ వెళ్లి కేంద్రం ఎప్పుడు ఎన్నిక లకు వెళ్లనుందో? విచారించి వారు ముందస్తు ఎన్నికలు జరిపే  ఆలోచనలో లేకపోవడంతో అంతకంటే ముందు జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తమ తెలంగాణా రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని నరెంద్ర మోదీ వద్ద చర్చించిన్లు హైదరాబాద్ సమాచారం. 


ఈ సందర్భంగా కెసిఆర్ కూడా కొందరు ముఖ్య అనుచరులు మరియు మంత్రులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన వారితో సమావేశం జరిపారు. కానీ ఆ భేటీలో  “ముందస్తు ఎన్నికలు” జరపకపోవటమే  మంచిదని అత్యధికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తుంది. 


ముందస్తు ఎన్నికలు జరప ప్రయత్నిస్తే ప్రజల్లోకి  "వ్యతిరేఖ, తిరోగమన సంకేతాలు వెళతాయని"  అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. దాంతో మంత్రులు, ముఖ్యుల అభిప్రాయాలు విన్న కేసీఆర్, “మనం ఇంతవరకు ముందస్తుకు వెళ్తామని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఇందులో మనకు ఎలాంటి సమస్య లేదని - ఎప్పటిలా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్దామని- ఈలోగా ప్రజల్లోకి మనం చేసిన పనులను అభివృద్ధిని వివరిస్తూ ముందుకు వెళ్దాము” అని చెప్పారట.


ఈ రెండు విభిన్న సందర్భాల్లో ఈ ఇద్దరు చంద్రులు, ముందే నిర్ణయాలు తీసుకున్నాకే, తమ అనుయాయుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నారు . వీరిలో ఆంధ్రా చంద్రుడు మాత్రం తమ పార్టీ మిత్రుల నుండి అభ్యంతరం వచ్చినా తన నిర్ణయాన్నివారిపై రుద్దటానికి సిద్ధమయ్యారు తన సహజ నియంతృత్వ ధోరణితోనే.  తెలంగాణా చంద్రుడు మాత్రం తమ అనుయాయుల నిర్ణయానికి తగిన గౌరవమిచ్చి తన నిర్ణయం మార్చుకున్నట్లుగా లేదా కనీసం పరిశీలించటానికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. 


అయితే ఇద్దరు చంద్రుల అంతర్గత సమావేశాల్లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న వారికి తప్ప ఇతరులకు తెలియకపోయినా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆ రెండు సమావేశాల్లో జరిగింది దాదాపుగా ఇదే నని ఇరు రాజధానులనుండి సమాచారం. దాని ప్రకారం ఆలోచిస్తే ఏ పార్టీ వాళ్ళు నియంతృత్వంలో మగ్గుతూ ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా కనీస గౌరవమైనా పొందుతున్నారో అర్ధమౌతుంది. 

ap-news-telangana-news-chandrababu-kcr-style-while

ap-news-telangana-news-chandrababu-kcr-style-while
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ అమ్మాయి పుల్వామా ఘటనపై "యాంటీ హేట్ చాలంజ్" ఉద్యమం
ప్రతిపక్షాలకు షాకింగ్! జయహో మోడీ! టైమ్స్ ఆన్‌-లైన్‌ పోల్..పోల్ పీరియడ్ ఫిబ్రవరి 11 టు 20
"అసలు ఈ లోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా!”
పాకిస్తాన్ పై భారత్ జలయుద్ధం
ఎడిటోరియల్: దేశమా? అధికారమా? అధికారమే అనే  రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనకవసరమా?
ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీ!  కాకపోతే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి?
జగన్ వ్యూహం మైండ్ బ్లోయింగ్ - ఆ పత్రికాధినేత పెన్నుకు నోటికి రెంటికీ తాళం వేసినట్లేనా?
పాక్ కు షాక్ - దటీజ్ మోడీ - ₹ 7 లక్షల కోట్ల పెట్టుబడులకు సౌదీ నిర్ణయం
ఎడిటోరియల్:   "వాళ్లను చంపేయాలి- భగవద్గీత కూడా చెపుతుంది" బాలిక మనాలి ప్రధానికి లేఖ - బాబు మమతకు పాఠం!
తెలుగుదేశం పార్టీకి తలకొరివి పెట్టేది చింత‌మ‌నేని లాంటివాళ్ళే!
ఉగ్రదాడితో దేశమంతా విషాదం అలుముకున్న వేళ  మోదీ, నితీష్ ముసి ముసి నవ్వులా?
ఎరిక్సన్ కేసులో అనిల్ అంబాని కోర్ట్ ధిక్కరణ-నేరం ఋజువైంది: సుప్రీం కోర్ట్
విశ్వవిజేతలు: రతన్ టాటా-అవమానించిన వారిపై కోపాన్ని, తన లక్ష్యంగా మార్చుకొని మౌనంగా విజయం సాధిస్తారు!
 ఇండియా టుడే సర్వే - దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!
మేం చేస్తే..సంసారం..ఇంకోళ్లు చేస్తే ఏదో అన్నట్టుంది టీడీపీ వ్యవహారం!
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
About the author