ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజకీయ వారసుడిగా ప్రస్తుతం ఐటి మినిస్టర్ గా కొనసాగుతున్నారు నారా లోకేష్ బాబు.  తండ్రి పద్దతిలో తనదైన రాజకీయాల్లో ప్రతిభ చూపిస్తున్న నారా లోకేష్ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంటారు.  తన ప్రత్యర్థులపై ప్రతిసారి ట్విట్టర్ వేధికగా చేసుకొని విమర్శలు చేస్తుంటారు.  ఇక నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మిణి తో వివాహం జరిగిన తర్వాత వారి అన్యోన్య దాంపత్యం గురించి పలు మార్లు సోషల్ మీడియాలో తెలుపుతూ వచ్చారు..తన కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

తాజాగా బ్రహ్మణితో తన వివాహం జరిగి 11 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఓ ఫొటో వైరల్ అయింది.  గత పదకొండేళ్లుగా.. నిజంగా తనను ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, ఎంతో విలువనిచ్చే వ్యక్తి ఉందని ప్రతి రోజు ఉదయం గుర్తు చేసుకుంటూ ఉన్నానని లోకేశ్‌ అన్నారు. 
Image result for లోకేశ్-బ్రహ్మణి ఫొటో family
భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రహ్మణి అని లోకేశ్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు.  కాగా, లోకేశ్-బ్రహ్మణి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: