ప్రపంచంలో ఉగ్రవాదం పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే.  వారి టార్గెట్ ఏమైనా..ఎంతో మంది అమాయకులు అన్యాయంగా చనిపోతున్నారు..వేల సంఖ్యలో వికలాంగులుగా మిగిలిపోతున్నారు.  ఎన్నో కుటుంబాలు విధిపాలు అవుతున్నాయి.  హైదరాబాదులో 11 ఏళ్ల క్రితం జరిగిన జంట పేలుళ్ల నగర వాసులు ఇప్పటికీ మర్చిపోలేరు.  అయితే ఈ కేసుపై ఎప్పుడు తీర్పు వస్తుందా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.   తాజాగా 11 ఏళ్ల క్రితం జరిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం వెలువరించాల్సిన తీర్పును వాయిదా వేసింది.

Image result for జంట పేలుళ్ల కేసు

వచ్చే నెల 4వ తేదీన తీర్పును వెలువరిస్తామని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. సోమవారం ఉదయం చర్లపల్లి జైలుకు చేరుకున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు కాసేపటికే తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, నేడు మరోసారి న్యాయస్థానం.. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. భద్రతా కారణాల రీత్యా వారిని జైల్లో నుంచే విచారించారు. అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 

Image result for జంట పేలుళ్ల కేసు

ఈ  కేసులో రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అనిక్ షఫీక్, ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీక్, మహ్మద్ షేక్, షఫ్రుద్దీన్, అమీర్ రిజాఖాన్లను కోర్టు నిందితులుగా తేల్చింది. ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురిపై విచారణ కొనసాగింది. 

Image result for జంట పేలుళ్ల కేసు

ఇండియన్ ముజాయిద్దీన్ తీవ్రవాద సంస్థ 2007 ఆగస్టు 25 న మారణహోమానికి తెగబడి 42 మందిని అమాయకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పందకొండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు వెలువరిస్తుందని ఆశగా ఎదురుచూసిన వారికి కొంత నిరాశే ఎదురైంది.  

Image result for జంట పేలుళ్ల కేసు

మరింత సమాచారం తెలుసుకోండి: