అమెరికాలో ఈ మద్య గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది.   ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  కొంత మంది ఉన్మాదులు..ఉగ్రవాదులు..చివరకు మైనర్లు కూడా కాల్పులకు పాల్పపడటం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. జాక్సన్ విల్లె నగరంలోని ఓ గేమింగ్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. 
Florida authorities report mass shooting at riverfront mall - Sakshi
జాక్సన్ విల్లె నగరంలోని ఓ పెద్ద ఎంటర్‌టైన్ మెంట్ క్లబ్‌లో వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. బాల్టిమోర్‌కు చెందిన డేవిడ్ కట్జ్ అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్టు ప్రాధమికంగా భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో  11 మందికి బుల్లెట్ గాయాలు కాగా.. మరో ఇద్దరికి ఇతర గాయాలైనట్లు స్థానిక పోలీస్ అధికారులు ట్వీట్ చేశారు. 
Image result for అమెరికాలోని ఫ్లోరిడా కాల్పులు
వీడియో గేమ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కట్జ్ అందులో ఓడిపోయినట్టు తెలుస్తోంది. అందుకే ఉక్రోషం తట్టుకోలేక హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు.కాల్పులు శబ్దం వినగానే అందులో ఉన్నవారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నానంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ‘అదృష్టవంతుడ్ని. లక్కీగా బయటపడ్డా. ఇంకెప్పుడూ ఇక్కడకు రాను’ అంటూ బాధితుడు ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఫ్లోరిడాలో ఇలాంటిదే కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూల్‌పై సాయుధుడు దాడి చేయడంతో ఏకంగా 17 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: