తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన ఎన్టీఆర్ తర్వాత తెలుగు గౌరవాన్ని నలుదిక్కులా చాటి చెప్పేందుకు తెలుగు దేశం పార్టీ స్థాపించి అప్పటి వరకు కాంగ్రెస్ ఎలుతున్న తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తెలుగు దేశం గ్రామ గ్రామానా మారుమోగింది. ఎన్టీఆర్ ని అన్నగా భావిస్తూ ప్రతి ఒక్కరూ అన్నా అని పిలిచేవారు. ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు చేస్తూ ఎన్టీఆర్ అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆయన కుమారుల్లో ఎక్కువ ఇష్టపడేవారిలో హరికృష్ణ, బాలకృష్ణలు ఇద్దరు. వీరిలో బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఎక్కువ హరికృష్ణ వెంట ఉండేవారు..తండ్రికి చేదెడు వాదోడుగా ప్రతి విషయంలో నాన్నతో పాటే ఉండేవారు.

 
ఫోటో ఫీచర్ : ఎప్పుడూ..నాన్నతోపాటే..!
అప్పట్లో ప్రజల్లోకి వెళ్లాలంటే చైతన్య రథం ఉండేది ఎన్టీఆర్ కి ఆ రథాన్ని నడిపే డ్రైవర్ మరెవరో కాదు నందమూరి హరికృష్ణ.  ఓ ఇంటర్వ్యూలో ఒక కొడుకు వాళ్ల నాన్న మీద ప్రేమతో ఏం చేసాడని అనేది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు ఇక పుట్టడు ! మా తాత గారి కోసం లక్ష కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపారు. ఏ కొడుకైనా పెళ్లయి తన పిల్లలతో జీవితం తాను సాగిస్తున్న ఈ సమాజంలో … 35 సంవత్సరాలు ఓ తండ్రి కోసం, తండ్రికి తోడుగా ఇంత ‘ డెడికేటెడ్ ‘ ఉన్న కొడుకునెప్పుడూ చూడలేదు.

  Image result for sr ntr family

ఇలాంటి తండ్రి కొడుకులుండడం మా అదృష్టం అన్నారు. ఇలా తండ్రీ కుమారుల మద్య ఎంతో అన్యోన్యత ఉండేది. సినిమా వారసుడిగా చేయాలని చూసినా హరికృష్ణ మాత్రం రాజకీయ వారసుడిగా ఉండాలనుకున్నారు..అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ మరి ఏ ఇతర పదవులు అలంకరించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: