సొమ్మొక‌రిది.. సోకొక‌రిది..! ఇది మ‌న డాబుస‌రి బాబుగారికి సరితూగే సామెత‌..! మంది సొమ్ముతో సొంత డ‌బ్బా కొట్టుకునే వాళ్ల‌కు  బాగా అతికిపోతుంది..! మాట‌ల్లో అమ‌రావ‌తి కోట‌లు క‌డుతున్న బాబు అడుగు మాత్రం గ‌డ‌ప దాటలె.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ప్ర‌గ‌ల్భాల ప్ర‌క‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.. అదిగ‌దిగో చూడండ‌హో.. అంటూ నూత‌న రాజ‌ధాని గ్రాఫిక్స్ న‌మూనా చిత్రాల‌తో ఇప్ప‌టికే ఊద‌ర‌గొడుతున్న చంద్ర‌బాబు.. మ‌రో కొత్త స్కెచ్ వేస్తున్నారు.  త‌న నాలుగేళ్ల అతుకుల గ‌తుకుల‌ పాల‌న గొప్ప‌త‌నాన్ని చెప్పేందుకు థియేట‌ర్ల‌లో యాడ్స్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంట‌. ఇందుకు ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసేందుకు నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. అంటే.. ప‌నిని పాత‌రేసి.. ఎన్నిక‌ల జాత‌ర‌కు వెళ్తున్నార‌న్న‌మాట‌.


చూస్తుండ‌గానే నాలుగేళ్లు గ‌డిచిపోయాయి.. అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణ ప‌నులు ఎక్క‌డివి అక్క‌డే ఉన్నాయి. ప్ర‌జావ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేయ‌డానికి.. రుణ మాఫీకి, అంగ‌న్‌వాడీల‌కు జీతాలు చెల్లించ‌డానికి కూడా డ‌బ్బులు లేవంటూ పొదుపు మాట చెబుతున్న చంద్ర‌బాబు.. అడ్డూ అదుపు లేకుండా త‌న సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డానికి మాత్రం వంద‌ల కోట్లు కేటాయిస్తుండం గ‌మ‌నార్హం. థియేట‌ర్ల‌లో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌తోపాటు.. న‌గ‌రాల్లో హోర్డింగ్స్‌, 130 షార్ట్ ఫిలిమ్స్ రూపొందించ‌డం..లాంటి వాటికి ఈ డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. ఏపీలోని ప్రతి గల్లీలో హోర్డింగులు పెట్టబోతున్నారు. ప్రతీ ఆర్టీసీ బస్సుకు పోస్టర్లు తగిలించబోతున్నారు. చివరికి డ్రైవర్లతో వ్యక్తిగత ఒప్పందాలు కుదుర్చుకొని ఆటోల వెనక కూడా అతికించబోతున్నారు. అయినా.. మంది సొమ్ముతో సొంత ప్ర‌చారం చేసుకోవ‌డం బాబుగారికి ఆచారమే క‌దా..! 

Image result for anganwadi ap

ఇక థియేట‌ర్ల‌లో హీరోల డైలాగుల కంటే ముందే బాబుగారి పాపుల‌ర్ డైలాగ్ విన‌బోతున్నామ‌న్న‌మాట‌. అదేంటి.. బాబుగారికి కూడా డైలాగ్ ఉందా..? అని ఆశ్చ‌ర్య‌పోకండి.. అది వింటే.. ఔన‌ను ఇది నిజ‌మేన‌ని మీరూ ఒప్పుకుంటారు. స‌మావేశాలు, స‌భ‌ల్లో ఇష్టం లేక‌పోయినా.. క‌ష్టాతిక‌ష్టంగా  చ‌ప్ప‌ట్లు కొట్టీ కొట్టీ నీర‌సించిపోయిన త‌మ్ముళ్ల‌తో.. `త‌మ్ముళ్లు.. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు` అని అడిగిమ‌రీ కోట్టించుకోవ‌డం ఆయ‌నకు ఎంత ఇష్ట‌మో  ఆంధ్రులంద‌రికీ తెలిసిందే. ఇప్పుడిక ఇదే డైలాగ్ థియేట‌ర్ల‌లోనూ విన‌క‌త‌ప్ప‌ద‌న్న మాట‌. అందుకేమ‌రి బాబుగారిని హైటెక్‌ ముఖ్య‌మంత్రి అని అంటుంటారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. ఆ ప్ర‌గ‌ల్భాల ప్ర‌క‌ట‌న‌ల్లో చంద్ర‌బాబుతోపాటు చిన‌బాబు కూడా కనువిందు చేయ‌బోతున్నార‌ట‌. ఇప్పుడు అంద‌రి చూపు చిన‌బాబు డైలాగ్స్ మీద‌నే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: