తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో.. త్వరలోనే కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. కొత్త జోనల్ విధానంపై కేంద్రం చెబుతున్న అభ్యంతరాలపై ప్రధాని నరేంద్ర మోదీకి వివరణ ఇచ్చారు.

Related image

అంతే కాకుండా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ కేసీఆర్ మాట్లాడారు. దీంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించింది. సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నీళ్లు- నిధులు-నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవరూపంలోకి తెచ్చి చూపిస్తున్నది.

Image result for జోనల్ విధానాన్ని

కొత్త జోనల్ విధానంలో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించనుండగా, మిగిలిన 5 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.  ఈ ఓపెన్ కేటగిరిలోనూ మిగతా తెలంగాణ జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడేందుకు వీలుంది. దీంతో అన్ని ఉద్యోగాలు కేవలం తెలంగాణ స్థానికత ఉన్నవారికే దక్కనున్నాయి. గతంలో జిల్లా స్థాయిలో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ పోస్టులు ఉండేవి. అదే జోన్ల విషయానికి వస్తే ఈ నిష్పత్తి 70:30 గా ఉండేది. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనున్నది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: