అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి ‘జ్ఞానం’ అనే వెలుగును ప్రసాధించ గలిగిన శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. కాలం మారిపోయినా విధ్యార్ధి వ్యక్తిత్వం ప్రభావితం చేయడంలో ఇప్పటికీ ఎప్పటికీ గురువు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంటుంది. ఆదియుగం నుండి ఆధునికయుగం వరకు గురువు ఋషిగా కొనసాగుతున్నాడు. మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. 

Image result for teachers day 2018

అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అని అంటారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి మనదేశ మాజీ రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5న గురువులను సన్మానించుకుని వారిపై మన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాము.
happy teachers day wishes quotes hd latest wallpaper
విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గురువు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థి క్షేమాన్ని కోరుకునే గురువును గుండెల్లో పెట్టుకునే సంస్కృతి మనది. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు. అలాంటి గురువు ప్రాముఖ్యత మన జీవితం పై ఎంతో ఉంది. విజ్ఞానంతోపాటు అనుబంధాలు  సత్ప్రవర్తన వంటి విలువలను నేర్పే గురువును గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది. 
Teachers Day image 1
అయితే విద్యార్ధుల జీవితం పై ఎంతో ప్రభావితం చూపే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. అప్పుడే సమాజానికి అవసరమయ్యేలా విధ్యార్ధులను గురువు తీర్చి దిద్దగలుగుతాడు. ఇంత ప్రాముఖ్యత ఉంది కనుకనే మన సంస్కృతిలో త్రిమూర్తులను గురువులో చూసుకుంటు ఉంటారు. చదువు చెప్పి జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడే విధంగా తీర్చిదిద్దే గురువులను ఎప్పటికీ మరువ కూడదు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి వారుస్థిరపడేలా చూడాలన్న ఆశయం ముమ్మాటికి గురువులకే ఉంటుంది. ప్రతీ యేటా గురువులను పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుకు చేసుకునేలా జరుపుకునే పండుగ ఈ టీచర్స్ డే..



మరింత సమాచారం తెలుసుకోండి: