ఈ మద్య బ్యాంకు సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు బ్యాంకు లావాదేవీలు జోరుగా కొనసాగిస్తున్నారు.   మీకు ఏవైనా బ్యాంకుపనులు అర్జంటుగా ఉన్నాయా..అయితే ఈ రోజే పూర్తి చేసుకోండి  ఎందుకంటే రేపటి నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి.  వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి.  శనివారం పనిదినాలైనా..అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తాయి. 

మరికొన్ని రాష్ట్రాల్లో ఒక పూట మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం (యూఎఫ్ఆర్‌బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది.

ఆ రెండు రోజులు భారతీయ రిజర్వు బ్యాంకు సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టే అవకాశం ఉంది.  దాంతో బ్యాంకు పనులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుకున్నా లావాదేవీలు జరగకపోవచ్చు. అంటే, మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: