ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నది చాలా తక్కువ సమయం అని..ఆయన పుట్టిన రోజు కూడా చేసుకోలేని పరిస్థితి అని ఆ మద్య ఆయన తనయుడు నారా లోకేష్ అన్నారు.  ఎప్పుడూ ప్రజా సంక్షేమం అంటూ..రాజధాని నిర్మాణం అంటూ అధికారులతో బిజీ బిజీగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఆయన తమ్ముడు సినీ హీరో నారా రోహిత్ తండ్రి  రామ్మూర్తి నాయుడి కలిసి కొద్ది సేపు ముచ్చటించారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు  చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. నేడు తిరుపతి సమీపంలో ఉన్న చెర్లోపల్లిలోని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి ఇంటికి వెళ్లారు.  సీఎం వెంట మంత్రి నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ, కలెక్టర్‌ ప్రద్యుమ్న ఉన్నప్పటికీ వారిని ఇంటి బయటే ఉండమని చెప్పి చంద్రబాబు ఒక్కరే లోనికి వెళ్లారు. అయితే  అధికారులను బయటే ఉండమని చెప్పిన చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి తమ్ముడు రామ్మూర్తి నాయుడితో పాటు ఆయన కుమారుడు, హీరో నారా రోహిత్ తో మాట్లాడారు.

తమ్ముడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  కుటుంబ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు వారితో గడిపారు. తమ్ముడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రామ్మూర్తి కుమారులతో చర్చించినట్టు తెలిసింది. ఇంటికి పెద్ద దిక్కుగా తానున్నానని, అధైర్య పడవద్దని మనోధైర్యం అందించినట్టు తెలిసింది. వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితో ఫొటోలు దిగారు. అనంతరం బయటికొచ్చిన సీఎం.. చుట్టుపక్కల వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: