ప్రపంచంలో ఉగ్రవాదం పెచ్చుమీరుతుంది. ఉగ్రవాదులు ఏ మూల నుంచి దాాడి చేస్తారో అంతుపట్టని పరిస్థితి నెలకొంది.  బాంబులతో ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో తెలియదు..వారి టార్గెట్ ఏదైనా..ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు.  వేల సంఖ్యల్లో వికలాంగులుగా మిగిలిపోతున్నారు..ఐన వారిని కోల్పోతున్నారు.  ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది.  తాాజాగా హైదరాబాద్‌‌లోని గోకుల్‌ఛాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురిపై నిందితులిగా అభియోగాలు మోపగా.. వారిలో ఇద్దరిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు చెప్పింది.మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.  

Court Verdict on Hyderabad Twin Blasts Case - Sakshi

గోకుల్‌ చాట్‌, లుంబినీ పార్క్‌ పేలుళ్ల కేసులో A1, A2లుగా ఉన్న అక్బర్ ఇస్మాయిల్, అనిక్ షరీక్ సయిద్‌‌లను దోషులుగా నిర్ధారించింది. వీరికి సోమవారం శిక్షలు ఖరారు చేయనున్నారు. దోషులపై సెక్షన్‌ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది.  2007 అగస్టు 25న జరిగిన ఈ పేలుళ్లలో 44 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది.

Hyderabad twin blast case

అనీక్‌ షఫీక్‌, ఇస్మాయిల్‌ చౌదరి, రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, మహ్మద్‌ తారీఖ్, షప్రుద్దీన్‌, మహ్మద్‌ షేక్‌, అమీర్‌ రజాఖాన్‌లను నిందితులుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ, అనీక్ షఫీక్ సయ్యిద్, ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్, మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్, తారీఖ్ అంజూమ్‌లు అరెస్టుకాగా.. రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీరజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. కాగా, గోకుల్ ఛాట్‌, లుంబినీ పార్క్‌ పేలుళ్లు... కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థ పనిగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.


ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌తోపాటు అతని సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌ సహా మొత్తం 11మందిపై అభియోగాలు నమోదుచేశారు. మొత్తం 286మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో మూడు ఛార్జిషీట్లు ఫైల్ చేసిన ఎన్‌‌ఐఏ మొత్తం 11వందల 25 పేజీల్లో అనేక విషయాలను తెలియజేసింది.  పేలుళ్లు ఎలా జరిగాయో ఎలాంటి పేలుడు పదార్ధాలు వినియోగించారో ఛార్జిషీట్‌లో వివరించింది. పేలుళ్లకు సంబంధించి ఎన్‌ఐఏ కీలక ఎవిడెన్స్‌ను కలెక్ట్‌ చేశారు. 

hyderabad gokul chat lumbini park twin bomb blast verdict postponed to monday

అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు.  11 ఏళ్లపాటు సుధీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణ తుది వాదనలు ఈ ఏడాది ఆగస్టు 7న ముగిశాయి. ఆగస్టు 27న తుది తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. కానీ న్యాయమూర్తి తీర్పును సెప్టెంబర్ 4కి వాయిదా వేశారు. నేడు ఇద్దరిని దోషులుగా తేల్చుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శిక్షను సోమవారానికి వాయిదా వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: