దక్షిణ కోల్‌కతాలోని మజెర్‌హట్ బ్రిడ్జి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 9 మంది గాయపడ్డారు. 20 నుంచి 25 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.  రైల్వే ట్రాక్ పైన ఓ వంతెన కుప్పకూలడంతో దాని  కింద బస్సులు, కార్లు  నుజ్జు నుజ్జు అయ్యాయి. ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.   ఈ సంఘటన అలీపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పలువురు శిథిలాల చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.  బ్రిడ్జి కూలగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 

అంబులెన్స్‌లు సైతం సంఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. బస్సు సర్వీసులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆర్మీ సేవలను కూడా సహాయక చర్యల్లో ఉపయోగించుకుంటున్నారు. బ్రిడ్జి కుప్పకూలడంతో బస్సు సర్వీసులతో పాటు ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది.     
BRIDGE COLLAPSE
ఈ ఘటనపై తక్షణ దర్యాప్తునకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రులు, అధికారులను ఆదేశించారు. కాగా,  ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పశ్చిమబెంగాల్ మంత్రి ఫర్హాద్ హకిం ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన బ్రిడ్జి 40 ఏళ్ల నాటిదని, ప్రస్తుతానికి అయితే ఈ ఘటనలో ఎవరూ మృతి చెందలేదని, గాలింపు, సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: