ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్షం వైసీపీలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయ నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ పార్టీలో సామాజిక వ‌ర్గాల వారీగా విభేదాలు త‌లెత్తుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ప్ర‌స్తుతం ఆచంట నియోజ‌వ‌క‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు త‌మ‌ను దూషిస్తున్నారం టూ.. ద‌ళిత వ‌ర్గానికి చెందిన నాయ‌కులు అంటున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఇక్క‌డ వైసీపీలో విభేదాలు కొన‌సాగుతు న్నాయి. నిజానికి ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే క‌మ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా ప్లాన్‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా బ‌లంగా ఉన్న చెర‌కువాడను వైసీపీలోకి చేర్చుకున్నారు. 


అయితే, ఇప్పుడు చెరుకువాడ కేంద్రంగా రాజ‌కీయాలు ముసురుకొంటుండ‌డం వైసీపీలో వ‌ర్గ విభేదాల‌ను సూచిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌వ‌క‌ర్గంలో బీసీ ఒట్ల త‌ర్వాత ఎక్కువ‌గా ఉన్న‌ది ద‌ళిత ఓట్లే.దీంతో ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా ద‌ళిత ఓటు బ్యాంకును ప్రాణ ప్ర‌దంగా భావిస్తుంది. కానీ, ఇక్క‌డ వైసీపీ మాత్రం ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆచంట‌లో ద‌ళిత వ‌ర్గాల‌కు సంబంధించిన స‌మావేశం నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ నియోజ‌వ‌క‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న చెర‌కువాడ స‌హా ప‌లువురు కీల‌క నాయ‌కులు హాజ‌రుకాలేదు. 

Image result for ys jagan

ఈ ప‌రిణామం మ‌రింత తీవ్రంగా మారింది. త‌మ‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే అణ‌గ‌దొక్కుతున్నార‌నేది ద‌ళితుల ఆవేద‌న‌గా ఉంది. ఆచంట వైసీపీ మండల అధ్యక్షుడు వైట్ల కిషోర్‌ వేదిక నుంచి వెళ్ళి పోవడంతో దళిత నాయకులలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకొంది. దళితులకు నియోజకవర్గంలో సమాన ప్రాధాన్యాన్ని కల్పించేవారని ఇటీవల వచ్చిన సమన్వయకర్త పార్టీలో కొందరికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మ‌రోప‌క్క‌, ఆచంట నియోజక వర్గానికి ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న కవురు శ్రీనివాస్‌ సమావేశానికి గైర్హాజరవ‌డం మ‌రింత‌గా వేడి పుట్టించింది. ఇలా మొత్తానికి ఆచంట‌లో వ‌ర్గ పోరు ప్రారంభ‌మై.. మొత్తానికి అది పార్టీకే చుట్టుకునేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: