ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్నారు..అందుకోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్ద పడుతున్నారు.  ముఖ్యంగా ఈజి మనీ కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు.  డ్రగ్స్ దందా, హైటెక్ వ్యభిచారం, చైన్ స్నాచింగ్, దొంగతనాలు ఇలా ఎన్నో మార్గాల్లో ఈజిగా డబ్బు సంపాదిస్తున్నారు.   అయితే తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరికిపోతారన్న నిజాన్ని వీళ్లు మరచిపోతున్నారు. గత కొంత కాలంగా నగరంలో హైటెక్ వ్యభిచారం చేస్తూ ఎంతో మంది విటులను మోసం చేస్తూ..బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. 

అయితే బయట సమాజానికి చూడా వీరు సమాజసేవకుల్లా బిల్డప్ ఇస్తూ..గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నా ముఠా సభ్యుల గుట్టును  విజయవాడ పోలీసులు రట్టు చేశారు.  వివరాల్లోకి వెళ్తే, పటమటలోని దానయ్య బజారులో నివసిస్తున్న ఇద్దరు మహిళలు సమరం ఆసుపత్రిలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు.  అయితే బయటకు మాత్రం సమాజాన్ని ఉద్దరించడానిమే తాము ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటూ..తాము సమాజ సేవకులం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో అక్కడకు వచ్చే మహిళలను వ్యభిచారం ఊబిలోకి దింపి, సొమ్ము చేసుకుంటున్నారు. దానయ్య బజారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ వ్యభిచారం దందా నడిపిస్తున్నారు.  అయితే కొంత కాలంగా ఇరుగు పొరుగు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పక్కా సమాచారం అందుకున్న సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా, నిందితుల నుంచి రూ. 13వేలు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: