తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. 'యువ తెలంగాణ' పేరుతో కొత్త పార్టీ ప్రాణం పోసుకుంది. జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమలు ఈ కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణలో ఇప్పటికే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని తెగ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పడటం రక రకాల చర్చలు మొదలయ్యాయి.  గత కొంత కాలంగా  నల్లగొండ  జిల్లా రాజకీయాల్లో  జిట్టా బాలకృష్ణ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.  ఇక న్యూస్ రీడర్ గా తనకంటూ ప్రత్యేక తెచ్చుకున్న రాణి రుద్రమ కూడా అందరికీ సుపరిచితమే. 

బాలకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడిగా, రాణి రుద్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. పర్యటనల సందర్భంగా పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.  ఇక జిట్టా బాలకృష్ణ మాట్లాడుతూ..మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

యువతకు, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.రాణి రుద్రమ మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: