తెలంగాణా శాసనసభ రద్ధుకు ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు వివరించిన కారణాలు సంక్షిప్తంగా:


ఉపోద్ఘాతం: అనేక త్యాగాలు, పోరాటాల తర్వాత ఆరు దశాబ్దాల తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. ఆ తర్వాత అత్యంత మెజార్టీ ఇచ్చి ప్రజలు తెరాసను ఎన్నుకున్నారు. అధికారంలోకి వచ్చాక కొన్నినెలల పాటు కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత కుదురుకున్నాం. తెరాస సాధించిన ప్రగతిని ప్రధాని, సహా కేంద్రమంత్రులు ప్రశంసించారు.

kcr కోసం చిత్ర ఫలితం

నాకు ఎకనమిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు కూడా వచ్చింది. 40 కి పైగా అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. గత నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రం 21.96 శాతం ప్రగతిని సాధించింది. ఓ వైపు ప్రగతి పథంలో రాష్ట్రం దూసు కెళుతుంటే, ప్రతిపక్ష పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టుల మీద, పనికిమాలిన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నాయి.

assembly of telangana dissolution కోసం చిత్ర ఫలితం

తెలంగాణా శాసనసభ రద్ధుకు ముఖ్యమంత్రి వివరించిన కారణాలు:

“రాజకీయ అసహనం, దుర్బుద్ధితో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలకు బుద్ధిచెప్పేందుకే ఎన్నికలకు వెళ్తున్నామని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. విపక్షాలు కురచబుద్ధితో మెదడు, ఆలోచన లేని ఆరోపణలు చేస్తున్నా యని మండిపడ్డారు. నేటికీ ప్రభుత్వం పైగానీ ఒక్క ఎమ్మెల్యేపై గానీ ఆరోపణ నిరూపించ లేకపోయాయని విమర్శించారు. తెలంగాణకు అసలు పీడ, మొదటి శత్రువు, రాష్ట్రానికి పట్టిన దరిద్రానికి రిజర్వుబ్యాంకు కాంగ్రెస్‌ పార్టీ అని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి సుస్థిరంగా కొనసాగేందుకు ఈ ఎన్నికలు తీర్పు ఇవ్వాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇటుకలతో బ్యాటింగ్‌ చేయడం కన్నా, ప్రజాక్షేత్రం లో తేల్చుకునేందుకు ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల ద్వారా రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్‌ పీడను ప్రజలు వదిలిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ రద్దు అనంతరం మంత్రులు, ఎంపీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్‌ విలేకర్లతో మాట్లాడారు. 


రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ప్రతిపక్ష పార్టీల రూపంలో కాకిగోలలు, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. స్క్వేర్‌-టేబుల్‌, రౌండ్‌-టేబుల్‌, వాళ్ల బొంద టేబుల్‌ అంటూ దుర్మార్గమైన ఆమోదయోగ్యంకాని, అవసరం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఆ కురచ వ్యక్తులు ఏమాత్రం అవగాహన, పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలుతున్నారు. కానీ ప్రభుత్వం కడుపు నోరుకట్టుకుని పట్టుదల, క్రమశిక్షణతో పనిచేస్తేనే ఈ ఏడాది ఐదు నెలల్లోనే 21.96 శాతం ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. ఇవేమీ మా పార్టీ గణాంకాలు కావు. కాగ్‌ రిపోర్టులు పరిశీలించి కేంద్ర ప్రభుత్వమిచ్చిన కితాబు. ఈ తరహా వృద్ధి అంటే పిల్లలాట కాదు.”


నీటి పారుదల రంగంపై తెరాస ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణతో పోటీ పడే రాష్ట్రాలు భారతదేశంలో లేవు. కానీ ప్రతిపక్షాలు పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నాయి అని కేసీఆర్‌ అన్నారు. ఇవన్నీ కేసిఆర్ శాసనసభ రద్ధుకు చెప్పిన కారణాలు.



*ఈ కారణాలే నిజమైతే శాసనసభ రద్దెందుకు?

*తొమ్మిది నెలల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమెందుకు?

*ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళితే ప్రజలే రానున్న ఎన్నికల్లో గెలిపిస్తారుగా!

*అలాంటప్పుడు రాష్ట్రాభివృద్ది ఆరు నెలల పాటు నిరోదించే ముందస్తు ఎందుకు?

*శాసనసభరద్ధు చేసి కూర్చుంటే ఎన్నికలవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మీరు చేయవలసిన అభివృద్ధి పనులు పడకెక్కుతాయి కదా!

*ప్రతిపక్షాలు మీ శాసన సభలో మిమ్మల్ని ఎదిరించేస్థాయిలో లేవుకదా! పార్టీ ఫిరాయింపులద్వారా మీరు పొందిన ఎమెల్యేల సంఖ్యా బలం ముందు ప్రతిపక్షాలెంత వాటి సంఖ్యా బలం ఎంత? 


కాబట్టి శాసనసభ రద్ధుకు మీరు చెప్పిన కారణాలతో ప్రజలు పొంతే విశ్వాసం "హస్తి మశాంతక మంత" ప్రతిపక్షాల స్వరం ఇప్పుడు ధృడతరం అవటం తథ్యం. ఇంతవరకు మీ మాటల చాతుర్యం జనాల్ని పడేయతం జరిగింది. ఇక ఆ మంత్రానికి జనం ఇమ్యూన్ అయిపోయారు. ఇక ప్రజలను సంతృప్తి పరచడానికి మీ మాటల చాతుర్యం చాలదు. చేతలు అవసరం. కాని మీరు శాసనసభ రద్ధుచేయటం తో మీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు.


మీరిచ్చిన వాగ్ధానాలలో - నిరుద్యోగులకు ఉద్యోగాలు, రెండు పడకల ఇళ్ళు - మీ వాగ్ధానాలకు మీరు చేసినదానికి అంతరం భూమ్యాకాశాలంత. రాష్ట్రంలో మీరు చేసిన తాగునీరు సాగునీటి పనులకు అయిన ఖర్చు చూస్తే అంతరం అనంతం. అవినీతి, దుర్వినియోగం, దుబారా ఇవి ప్రజా హృదయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.


"తెలంగాణ కోసం తెరాస ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేసింది. తెలంగాణకు అవసరమైన ప్రతిసారీ ప్రతి సందర్భంలోనూ రాజీనామాలు చేసి విసిరేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మరోసారి త్యాగానికి సిద్ధపడ్డాం. రాష్ట్రం బాగు కోసం అసెంబ్లీ రద్దు చేశాం. రద్దు నిర్ణయం ప్రకటించగానే, ఒక్క ఎమ్మెల్యే కూడా అడ్డు చెప్పకుండా రద్దుకు ఒప్పుకున్నారు"

telangana assembly కోసం చిత్ర ఫలితం

*పై విషయం ప్రకారం రాష్ట్రాన్ని గొర్రెలమందలా నడిపిస్తున్నారా కెసిఆర్? తెలంగాణా కోసం పోరాడిన వాళ్ళందరికి మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు దక్కాయా?

*ఉద్యమ కాలంలో రాజీనామాలు ప్రయోజనాన్నిస్తాయి. ఇప్పుడు కావలసింది అభివృద్ధి దానికి దానికి ఎన్నికల కోడు అమలై, మళ్ళా సాధారణ ఎన్నికలప్పుడు ఎన్నికల కోడు అమలైతే దాదాపు ఆరునెలల పాటు అభివృద్ది ఆగిపోదా?

*అందరికి మూడు నెలలే అభివృద్ధి ఆగిపోతే మనకు ఆరు నెలలా?

*ఇదెనా తెరాస ప్రగతి పథం?

సంబంధిత చిత్రం

ఈ సందర్భంగా విచ్చలవిడిగా చేసే దుబారా అనితర సాధ్యం. ప్రగతి నివెదన సభ పేరుతో మీరు దాదాపు మూణ్ణెల్లు పాలన పై శ్రద్ధపెట్టలేదు. ముందస్తు ద్వార దాదాపు ఇప్పుడు తొమ్మిది నెలల ప్రణాళికా కాలం వృధా చేశారు. మళ్ళా 50 రోజులు 100 సభల పేరుతో జరిగే అధికార దుర్వినియోగం ఆర్ధిక దుబారా ఇదంతా ప్రజల కోసమేనా?  ఎన్నికల వల్ల ప్రతి సారి జాతి ఆర్ధికం గా అభివృద్ధిపరంగా నష్ట పోతుందనే భారత ప్రధాని “జమిలి ఎన్నికలు” ప్రతిపాదిస్తే దానికి మద్దతిచ్చిన తొలి ముఖ్యమంత్రి మీరే కదా? మరిప్పుడు “అదనం - ముందస్తు ఎన్నికలు” తెచ్చి మన రాష్ట్రానికి ఆర్ధికంగా బొక్క పెట్టటం ఘోరం కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: